Home » కెన‌డాలో ఆర్ఆర్ఆర్ క్రేజ్…వీడియో వైర‌ల్….!

కెన‌డాలో ఆర్ఆర్ఆర్ క్రేజ్…వీడియో వైర‌ల్….!

by AJAY

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమా మార్చి 25న విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి సంకాంత్రి పండ‌గ‌కే ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉంది.

కానీ కరోనా కేసుల కార‌ణంగా సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. ఇక ఈ సినిమా టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్ ల‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. కాగా టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్ లు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

rrr-movie-review

ట్రైల‌ర్ లోని భారీ యాక్షన్ సీన్లు ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు సినిమా పై అంచనాల‌ను భారీగా పెంచేశాయి. దాంతో ఎక్క‌డ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియానే కనిపిస్తుంది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా క్రేజ్ కేవ‌లం భారత్ లోనే కాకుండా ప్ర‌పంచ‌దేశాల‌లో కూడా క‌నిపించ‌డం విశేషం.

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ ను మ‌రియు ఎన్టీఆర్ పేరును కెన‌డాలో ఎన్టీఆర్ అభిమానులు కార్ల‌తో వచ్చేలా చేశారు. కొన్ని కాస్ట్లీ కార్ల‌తో మొద‌ట ఆర్ఆర్ఆర్ టైటిల్ వ‌చ్చేలా చేసి ఆ త‌ర‌వాత ఎన్టీఆర్ పేరును వ‌చ్చేలా చూపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ ఆఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ పేజి షేర్ చేసింది. కాగా ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Visitors Are Also Reading