Home » RRR క్లైమాక్స్ లీక్ ! అసలు దీనికి తారక్ ఫాన్స్ ఒప్పుకుంటారా ?

RRR క్లైమాక్స్ లీక్ ! అసలు దీనికి తారక్ ఫాన్స్ ఒప్పుకుంటారా ?

by AJAY
Published: Last Updated on

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ మ‌రియు ఎన్టీఆర్ లు హీరోలుగా న‌టిస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ గోండు బెబ్లులి కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తుండగా రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో నటించారు. ఇక సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా అలియా భ‌ట్ న‌టించగా ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ న‌టించింది.

rrr-movie-review

ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్ మరియు ట్రైల‌ర్ లు విడుద‌ల చేయ‌గా పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డంతో పాటూ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. జ‌క్క‌న్న మ‌రోసారి విజువల్ వండ‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నార‌ని కుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎమోష‌న‌ల్ ఎండింగ్ ఉండ‌బోతుంది అంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాలో బ్రిటిష్ సైన్యంతో పోరాడుతూ దేశం కోసం ఎన్టీఆర్ చ‌ర‌ణ్ లు అంగ‌వైక‌ల్యానికి గుర‌వుతార‌ట‌.

RRR FIRST RIVEW

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కండ్లు కోల్పోగా రామ్ చ‌ర‌ణ్ కాళ్ల‌ను కోల్పోతార‌ట‌. అయితే ఇదే సినిమాపై మ‌రో వార్త కూడా వినిపిస్తోంది. సినిమాలో ఇద్ద‌రిలో ఒక హీరో ప్రాణాలు కోల్పోతార‌ట‌. అయితే ఇదే గ‌న‌క జ‌రిగితే ఫ్యాన్స్ ఒప్పుకోవ‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే ఇద్ద‌రు హీరోల‌లో ఏ హీరోను చంపేసినా కూడా ఆ హీరో అభిమానులు ఊరుకోరు. అంతే కాకుండా ఈ సినిమా దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కింద‌ని అంతా అనుకున్నారు.

Also Read: ఆర్ఆర్ఆర్ కొత్త పాట “ఎత్త‌ర‌జెండా” లో ఈ విష‌యాన్ని గమ‌నించారా..?

కానీ ఈ సినిమా పూర్తిగా స్నేహం నేప‌థ్యంలో ఉండ‌బోతుంద‌ట‌. చ‌ర‌ణ్ ఎన్టీఆర్ ల మ‌ధ్య ఉండే స్నేహం ఎమోష‌న‌ల్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ కాబోతున్నాయ‌ట‌. ఇక ఒక‌ప్పుడు సినిమాల‌లో నెగిటివ్ ఎండింగ్ ఉంటే ప్రేక్ష‌కులు ఒప్పుకునేవారు కాదు. కానీ ఇటీవ‌ల కాలంలో నెగిటివ్ ఎండింగ్ తో వ‌చ్చిన చాలా సినిమాలు స‌క్సెస్ అయ్యాయి. ఇక ఆర్ఆర్ఆర్ ఎలా ఉండ‌బోతుందో చూడాలంటే మార్చి 25వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

Also read: కోలీవుడ్ లో విడాకులు ప్ర‌క‌టించిన మ‌రో స్టార్ క‌పుల్…!

Visitors Are Also Reading