Home » RRR , మహర్షిలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే ? ఆ పిల్లాడి బ్యాక్ గ్రౌండ్ ఇదే

RRR , మహర్షిలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే ? ఆ పిల్లాడి బ్యాక్ గ్రౌండ్ ఇదే

by AJAY
Ad

రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ బ‌డ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా అలియా భ‌ట్ న‌టించ‌గా రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా ఒలివియా మోరిస్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో అజ‌య్ దేవ్ గ‌న్ మరియు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అంతే కాకుండా త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని కూడా సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించాడు. అయితే ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ మ‌రియు ఎన్టీఆర్ లు అల్లూరి సీతారామ‌రాజు మ‌రియు కొమురంభీం పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

అయితే అల్లూరి మ‌రియు కొమ‌రం భీం ల చిన్ననాటి సీన్ల‌ను కూడా సినిమాలో చూపించ‌బోతున్నారు. దాంతో సినిమాలో కొంత‌మంది చైల్డ్ ఆర్టిస్ట్ లను కూడా తీసుకున్నారు. ఇక  చిన్న‌నాటి ఎన్టీఆర్ త్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మ‌హ‌ర్షి సినిమా చూసారా…ఈ సినిమాలో మ‌హేశ్ బాబు న‌రేష్ వాళ్ల సొంతూరుకు వెళ్లి అక్క‌డే కంపెనీ పెట్టి న‌డిపిస్తూ ఉంటారు.

Advertisement

కాగా అక్క‌డ మ‌హేశ్ బాబుకు ఓ మూగ అబ్బాయి ప‌రిచ‌యం అవుతాడు. ఆ పిల్లాడితో మ‌హేశ్ బాబుకు అనుబంధం ఏర్పడుతుంది. ఇక మ‌హేశ్ బాబు ఊరినుండి వెళ్లిపోతున్న‌ప్పుడు ఆ బాబు విజిల్ ఊదుతూ ఇక్క‌డే ఉండిపోవాల‌ని కారు వెంట ప‌రిగెడ‌తాడు. ఆ పిల్లాడి పేరు చ‌క్రి…..అత‌డి అస‌లు పేరు రామ్ చ‌ర‌ణ్. ఇక ఈ బుడ్డోడు ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియ‌ర్ కొమురం భీం పాత్రలో క‌నిపించ‌బోతున్నాడు.

Also Read: “ఇంద్ర” క్రియేట్ చేసిన ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టలేక‌పోయిన బాహుబ‌లి…!

ఈ పిల్లాడి వ‌య‌సు 11 ఏళ్లు…ఈ బుడ్డోడి తండ్రి హైద‌రాబాద్ లో స్టిల్ ఫోటో గ్రాఫ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. ఇక చెర్రీ తండ్రి అత‌డి ఫోటోల‌ను ఫేస్ బుక్ లో ఎక్కువ‌గా పెడుతుండేవాడు. ఆ ఫోటోలు కాస్తా ఓ ద‌ర్శ‌కుడి కంట ప‌డ‌టంతో సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌క్రి 45కు పైగా సినిమాల‌లో న‌టించాడు. అంతే కాకుండా త‌న‌కు సినిమాలు అంటే చాలా ఇష్ట‌మ‌ని చెబుతున్నాడు. మ‌నం, మ‌హ‌ర్షి, నేనొక్క‌డినే, బ్ర‌హ్మోత్స‌వం స‌హా మ‌రికొన్ని సినిమాల‌లో న‌టించాడు.

Also Read: SAMANTHA : స‌మంతతో క్లోజ్ గా ఉంటున్న ఈ వ్యక్తి ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading