Home » SAMANTHA : స‌మంతతో క్లోజ్ గా ఉంటున్న ఈ వ్యక్తి ఎవ‌రో తెలుసా..?

SAMANTHA : స‌మంతతో క్లోజ్ గా ఉంటున్న ఈ వ్యక్తి ఎవ‌రో తెలుసా..?

by AJAY
Ad

టాలీవుడ్ బ్యూటీ స‌మంత‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఏమాయ‌చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఎంతో మంది కుర్రాళ‌ను త‌న అందంతో మాయ‌చేసింది. మొదటి సినిమాతోనే ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ప‌క్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకుంది. ఆ త‌ర‌వాత స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కావాలు ద‌క్కించుకుంది.

Advertisement

టాలీవుడ్ లో మ‌హేశ్ బాబు, రామ్ చ‌ర‌ణ్, ప‌వ‌న్ క‌ల్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల‌కు జోడీగా న‌టించింది. ఇక మొద‌టి సినిమా చేసిన నాగ‌చైత‌న్య‌నే స‌మంత ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ల ప్రేమాయ‌ణం త‌ర‌వాత వీరిద్ద‌రూ వివాహం చేసుకున్నారు. కానీ గ‌తేడాది తాము విడాకులు తీసుకుంటున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

Advertisement

samantha

samantha

అయితే తాము విడాకులు తీసుకోవ‌డానికి కార‌ణం మాత్రం స‌మంత గానీ చైతూ గానీ బ‌య‌ట పెట్ట‌లేదు. ఇదిలా ఉంటే విడాకుల ప్ర‌క‌ట‌న త‌ర‌వాత స‌మంత మ‌ళ్లీ సినిమాల్లో బిజీగా మారిపోయింది. ఇప్ప‌టికే పుష్ప సినిమాలో ఊ అంటావా ఉఊ అంటావా అంటూ స‌మంత ఐట‌మ్ సాంగ్ కు స్టెప్పులు వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు స‌మంత య‌శోద అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌గా ఉండ‌బోతుంది.

అంతే కాకుండా సినిమాలో యాక్ష‌న్ సీన్లు కూడా ఎక్కువ‌గా ఉండ‌బోతున్నాయి. దాంతో ఈ సినిమా కోసం మేక‌ర్స్ హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ బెన్ నే ను తీసుకున్నారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 కు కూడా బెన్ నే యాక్ష‌న్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశారు. ఇక స‌మంత కూడా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. దాంతో బెన్ రే తో ముందే ప‌రిచ‌యం ఉండ‌టం వ‌ల్ల స‌మంత ఆయ‌న‌తో స‌న్నిహితంగా క‌నిపిస్తోంది.

Visitors Are Also Reading