Telugu News » పుష్పలో అల్లు అర్జున్ కు త‌ల్లిగా న‌టించిన న‌టిఎవ‌రో తెలుసా..?

పుష్పలో అల్లు అర్జున్ కు త‌ల్లిగా న‌టించిన న‌టిఎవ‌రో తెలుసా..?

by AJAY MADDIBOINA
Published: Last Updated on

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప సినిమా థియేట‌ర్ల‌లో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్ల ప‌రంగా పుష్ప త‌గ్గేదే లే అంటున్నాడు.

Ads

ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే న‌టీన‌టులు అంద‌రూ త‌మ పాత్ర‌ల్లో జీవించిన సంగ‌తి తెలిసిందే. అయితే కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన న‌టీన‌టులు అంద‌రూ ఇదివ‌ర‌కూ నోటెడ్ ఫేస్ లే కానీ అల్లు అర్జున్ కు త‌ల్లిగా న‌టించిన న‌టిని మాత్రం ఇదివ‌ర‌కూ పెద్ద‌గా సినిమాల్లో చూసి ఉండ‌దు. దాంతో బన్నీ త‌ల్లిగా యాక్టింగ్ ఇర‌గ‌దీసిన న‌టి ఎవ‌రా అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

pushpa actress kalpalatha

pushpa actress kalpalatha

ఆ న‌టి పేరు క‌ల్ప‌ల‌త కాగా ఆమె ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌లో న‌టించింది కూడా. కానీ పుష్ప‌లో వ‌చ్చినంత కీల‌క పాత్ర‌లో న‌టించ‌లేదు. తాజాగా క‌ల్ప‌ల‌త త‌న‌కు పుష్ప‌లో అవ‌కాశం ఎలా వ‌చ్చిందో తెలిపింది. అంద‌రి లాగే తానుకూడా పుష్ప ఆడిష‌న్ కు వెళ్లిన‌ట్టు ఆమె పేర్కొంది. చిత్తూరు యాస‌లో మాట్లాడ‌టం చాలా క‌ష్టంగా అనిపించిందని కానీ ప్ర‌య‌త్నించాన‌ని తెలిపింది. స‌రిగ్గా ఆరు నెల‌ల త‌ర‌వాత త‌న‌కు ఫోన్ వ‌చ్చింద‌ని పేర్కొంది.

పుష్ప‌లో అవ‌కాశం వ‌చ్చింద‌ని ఫోన్ రావ‌డంతో ఏ పాత్ర‌కు అని అడిన‌ని దాంతో మీరు ఏ పాత్ర‌కు ఆడిష‌న్ ఇచ్చార‌ని తిరిగి ప్ర‌శ్నించార‌ని తెలిపింది. తాను త‌ల్లి పాత్ర‌కు ఆడిష‌న్ ఇచ్చాన‌ని చెప్పాగా ఆ పాత్ర‌కే అవ‌కాశం వ‌చ్చింద‌ని హీరో అల్లు అర్జున్ కు త‌ల్లిగా చేయాల‌ని చెప్పారని వెల్ల‌డించింది. దాంతో త‌న ఆనందానికి అవ‌దుల్లేవ‌ని తెలిపారు. పుష్ప‌లో తాను అల్లు అర్జున్ కు త‌ల్లిని అని కానీ త‌న‌కు సుకుమార్ తల్లి అంటూ ఉబ్బి త‌బ్బి పోయింది.

Also Read: క‌ల‌లో రామ‌చిల‌క క‌నిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?


You may also like