మనుషులకు కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. కొన్ని కలలు స్పష్టంగా ఉంటే కొన్ని కలలు మాత్రం అస్పష్టంగా ఉంటాయి. ఎక్కువగా ఆలోచించే వారికే కలలు వస్తుంటాయి. నిజానికి కలలు రావడానికి ఆలోచించడానికి సంబంధం లేదని శాస్త్రం చెబుతోంది. అయితే అలా కలలు రావడానికి మన జీవితంలో జరగబోయే సంఘటనలకు కూడా లింక్ ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
parrot
సాధారణంగా మనుషులకు కలలో పర్వతాలు, జంతువులు, పక్షులు కనిపిస్తూ ఉంటాయి. మరి కొంతమందికి పాములు సైతం కలలోకి వస్తూ ఉంటాయి. అయితే కొన్ని రకాల పక్షులు కలలోకి వస్తే చాలా మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందులో రామ చిలక కూడా ఒకటి. రామ చిలక కలలోకి వస్తే అదృష్టం ఉడుంపట్టు పడుతుందట. రామచిలక కలలోకి వచ్చిందంటే సడెన్ గా ఏదో మంచి జరగబోతుందని సంకేతమట. వ్యాపార రంగాల్లో అధిక లాభాలు రావడం..గౌరవం పెరగటం, అనుకోని రీతిలో ధనార్జన ఉంటుందట.
అందువల్ల రామచిలక కలలో కనిపించడం శుభసూచకం అని చెబుతుంటారు. సంతాన ప్రాప్తి లేని వారికి సంతానం కలగటం…ఉద్యొగాలు అప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు రావడం కూడా జరుగుతుందట. రామ చిలకతో పాటూ కొంగలు, పిచ్చుకలు, నెమలి, గరుడ పక్షి కలలో కనిపించినా శుభసూచకమే అని శాస్త్రం చెబుతోంది. అయితే కాకి మాత్రం కలలో కనిపించడం శుభ సూచకం కాదని శాస్త్రం చెబుతోంది.