Home » పుష్ప‌లో పోలీస్ గా అద‌ర‌గొట్టిన స‌త్రు ఎవ‌రు..? సుకుమార్ కు ఏమ‌వుతాడో తెలుసా..!

పుష్ప‌లో పోలీస్ గా అద‌ర‌గొట్టిన స‌త్రు ఎవ‌రు..? సుకుమార్ కు ఏమ‌వుతాడో తెలుసా..!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బ‌స్టర్ పుష్ప సినిమాలో సుకుమార్ చాలా మంది టాలెంటెడ్ న‌టీన‌టుల‌కు అవ‌కాశం ఇచ్చాడు. వారిలో స‌త్రు కూడా ఒక‌రు. ఆర‌డుగుల ఎత్తు చుర‌క‌త్తుల్లాంటి చూపుల‌తో స‌త్రు విల‌న్ గా ఎంతో వైల్డ్ గా క‌నిపిస్తాడు. సత్రు చాలా సినిమాల్లో న‌టించినా నాని హీరోగా న‌టించిన కృష్ణ గాడి వీర‌ప్రేమ‌గాథ సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్ అన్న‌గా స‌త్రు న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలో యాక్ష‌న్ స‌న్న‌వేశాలతో అద‌ర‌గొట్టాడు.

Advertisement

ALSO READ : ‘భీమ్లానాయక్’ ట్రైలర్ పై శ్రీరెడ్డి సెటైర్లు ! కామెడీ గా ఉంది అంటూ..

 

ఇక స‌త్రు పుట్టింది రాజ‌మండ్రిలో కాగా పెరిగింది మాత్రం ఒడిస్సాలో…అక్క‌డ స‌త్రు కుటుంబం వ్య‌వ‌సాయం చేస్తూ జీవనం కొన‌సాగిస్తోంది. స‌త్రు నిజానికి డాక్ట‌ర్ అవ్వాల‌నుకున్నాడు కానీ యాక్ట‌ర్ గా మారాడు. సినిమా అవ‌కాశాల కోసం ఒడిస్సా నుండి స‌త్రు హైద‌రాబాద్ కు వ‌చ్చాడు. ఇక్క‌డ మైక్రోబ‌యాల‌జీ కోర్స‌లో చేరాడు. మొద‌ట‌గా రానా హీరోగా న‌టించిన లీడర్ సినిమాలో త‌న స్నేహితుడి ద్వారా అవ‌కాశం ద‌క్కించుకున్నాడు.

Advertisement

Also read : చిరు’ గొప్ప నటుడా ? ‘మోహన్ బాబూ’ ? అన్న ప్రశ్న కి దాసరి గారు ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా?

స‌త్రు న‌ట‌న చూసి శేఖ‌ర్ క‌మ్ముల ఎన‌ర్జిటిక్ ప‌ర్ఫామ‌ర్ అనే కితాబు ఇచ్చార‌ట‌. ఆ త‌ర‌వాత బాహుబ‌లి, ఆగ‌డు సినిమాల‌లో కూడా న‌టించాడు. కానీ కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో గుర్తింపు వ‌చ్చిన త‌ర‌వాత అల్లు అర్జున్ హీరోగా న‌టించిన డీజే సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించాడు. ఇక తాను న‌టించిన అలియాస్ జాన‌కి సినిమా కాస్ట్యూమ్ డిజైన‌ర్ వినూత్న‌ను స‌త్రు ప్రేమ‌వివాహం చేసుకున్నాడు.

ఇక రీసెంట్ స‌త్రు పుష్ప సినిమా ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండ‌గా స‌త్రు మొద‌ట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం సినిమాలో న‌టించాడు. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. దాంతో సుకుమార్ పుష్ప సినిమాలోనూ అవ‌కాశం ఇచ్చాడు.

Visitors Are Also Reading