సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు అబ్బాస్. ప్రస్తుతం ఈ హీరో సినిమాలకు దూరమైనా ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. 90స్ లో అబ్బాస్ అమ్మాయిల మనసు దోచుకుని కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటివరకు అరవిందస్వామి అంటే అందగాడు అని చెప్పుకునే వారు కానీ అబ్బాస్ వచ్చి ఆ ప్లేస్ ను రీప్లేస్ చేశారు. అబ్బాస్ వెస్ట్ బెంగాల్ లోని హౌరా లో జన్మించాడు. ఇక మోడలింగ్ పైన ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 1996లో కాదల్ దేశం అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Advertisement
ఈ చిత్రాన్ని ప్రేమదేశం పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు అబ్బాస్ అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక 1997లో ప్రియా ఓ ప్రియా అనే సినిమాతో నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. మొత్తం తెలుగులో 10 చిత్రాలు చేశాడు. అంతేకాకుండా అన్ని భాషల్లో కలిపి 50 సినిమాలకు పైగానే చేశాడు. హీరోగా ఎంతో గుర్తింపు వచ్చినప్పటికీ కొంతకాలానికి అబ్బాస్ కు హిట్లు పడకపోవడంతో అవకాశాలు కరువయ్యాయి.
Advertisement
దాంతో సినిమాలకు పూర్తిగా దూరం అవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అబ్బాస్ సినిమాలకు గుడ్ బై చెప్పాడు. అయితే తనకు ఇక్కడ ఎదురైన అనుభవాలతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఒకప్పుడు స్టార్ హీరోగా లగ్జరీ లైఫ్ చూసిన అబ్బాస్ ఇలా అయిపోయాడెంటి… ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నాడు ఏంటి అని కొంతమంది కామెంట్లు చేయడంతో ఆ తర్వాత అబ్బాస్ ఏకంగా దేశాన్ని విడిచి స్విజర్లాండ్ కు వెళ్ళిపోయాడు. అక్కడ కొంతకాలం పాటు పెట్రోల్ బంక్ లో సైతం పనిచేశాడు. అంతేకాకుండా భవన నిర్మాణ కూలీగా సైతం అబ్బాస్ పని చేసినట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
వేరే దేశంలో అయితే ఏం పని చేస్తున్నా అనేది పట్టించుకునేవారు ఉండరు అనే కారణంతోనే దూరంగా వెళ్లిపోయినట్టు అబ్బాస్ తెలిపాడు. ఇక స్విజర్లాండ్ లో కొంతకాలం గడిచిన తర్వాత అబ్బాస్ భవన నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. అంతేకాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా మంచి గుర్తింపును సాధించారు. దాంతో ప్రస్తుతం మోటివేషనల్ స్పీకర్ కొనసాగుతూ వ్యాపారాలు చేస్తున్నాడు. మరోవైపు అబ్బాస్ పెళ్లి చేసుకుని కుటుంబంతో హ్యాపీగా గడుపుతున్నాడు. అయితే అబ్బాస్ సినిమాల్లోకి మళ్లీ వస్తాడా లేదా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Also read :
పవన్ కళ్యాణ్ ఉంగరాలు ధరించడానికి అసలు కారణం అదేనా..?
ఆ స్టార్ హీరో చేయాల్సిన “ఠాగూర్” సినిమాను చిరంజీవి లాక్కున్నారా..? తెరవెనక జరిగింది ఇదేనట..!