Home » ఆ స్టార్ హీరో చేయాల్సిన “ఠాగూర్” సినిమాను చిరంజీవి లాక్కున్నారా..? తెరవెనక జరిగింది ఇదేనట..!

ఆ స్టార్ హీరో చేయాల్సిన “ఠాగూర్” సినిమాను చిరంజీవి లాక్కున్నారా..? తెరవెనక జరిగింది ఇదేనట..!

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్ళడం సాధారణమే. అయితే అలా వెళ్లిన సినిమాలు కొన్ని సార్లు బ్లాక్ బస్టర్ గా నిలుస్తాయి. దాంతో ఆ సినిమాను మిస్ చేసుకున్న హీరోలు నిరాశ చెందక తప్పదు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా కూడా ఓ స్టార్ హీరో మిస్ చేసుకోవడం వల్ల ఆయన చేతికి వచ్చిందే. ఆ స్టార్ హీరో ఎవరు…? మెగాస్టార్ చేతికి ఆ సినిమా ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం….

Advertisement

 

తమిళ్ లో మురుగదాస్ తీసిన రమణ సినిమాకు రీమేక్ గా ఠాగూర్ చిత్రం తెరకెక్కింది. అప్పట్లో రమణ రికార్డులు క్రియేట్ చేసింది. అవినీతి… లంచగొండితనంను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే రమణ సినిమాలో చివరకు హీరో చనిపోతాడు. కానీ తెలుగులో హీరో చనిపోతే ఆడియన్స్ జీర్ణించుకోలేరు. ఈ కారణంతోనే ఠాగూర్ లో చిరంజీవి బ్రతికే ఉంటారు. ఇక తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన రమణ కు రీమేక్ గా వచ్చిన ఠాగూర్ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు.

Advertisement

ఈ సినిమాలో శ్రీయ సరన్ చిరంజీవికి జోడిగా నటించింది. ఈ సినిమాలోని కొన్ని సీన్లు థియేటర్ లో క్లాప్స్ కొట్టించాయి. అయితే అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా టాగూర్ ను ఓ టాలీవుడ్ హీరో మిస్ చేసుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు…. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. మొదట ఠాగూర్ సినిమా రాజశేఖర్ వద్దకే వచ్చింది. కానీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాజశేఖర్ డేట్స్ సరిపోవడం లేదని ఈ చిత్రాన్ని పక్కన పెట్టారు.

rajashekar

rajashekar

దాంతో అదే కథ మెగాస్టార్ వద్దకు వెళ్ళింది. ఆయనకు కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా వి.వి వినాయక్, చిరు కాంబినేషన్లో ఠాగూర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే ఓ సూపర్ హిట్ గా నిలిచిపోయింది. అయితే చిరంజీవి ఠాగూర్ ను రాజశేఖర్ నుండి లాక్కున్నారు అని అప్పట్లో కొన్ని గాలి వార్తలు చెక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

Also read :

బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి ఇండ‌స్ట్రీని ఏలుతున్న 6గురు స్టార్ హీరోలు వీరే..!

దర్శకుడు వెంట పడినా బ్లాక్ బస్టర్ సినిమా “బాషా” కు బాలయ్య ఎందుకు నో చెప్పారో తెలుసా ….!

Visitors Are Also Reading