ప్రభుదేవ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. సుందరం మాస్టర్ కుమారుడుగా సినిమాల్లోకి వచ్చిన ప్రభుదేవ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తన డ్యాన్స్ తో ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే బిరుదును కూడా ప్రభుదేవ సంపాదించుకున్నాడు. కేవలం డ్యాన్స్ లతోనే కాకాకుండా నటుడుగా కూడా పలు చిత్రాలలో ప్రభుదేవ నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుదేవ దర్శకుడుగా మారి సినిమాలను సైతం తెరకెక్కించాడు.
Also Read: బాలకృష్ణ కంటిచూపుతోనే చంపేస్తాడు…రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్…!
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో ప్రభుదేవ డైరెక్టర్ గా సూపర్ హిట్ ను సైతం అందుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రభుదేవ సినిమా కెరీర్ గురించి అందరికీ తెలుసు కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రభుదేవ మొదట రమాప్రభ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ తరవాత నయనతార మోజులో పడి రమాప్రభకు విడాకులు కూడా ఇచ్చాడు.
Also Read: పుష్ప- 2 నుండి మరో లీక్…ఆ సీన్ కు గూస్ బంప్స్ పక్కా…?
కానీ ఆ తరవాత నయనతారతో ప్రభుదేవకు విభేదాలు వచ్చాయి. దాంతో ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఇద్దరూ విడిపోయిన తరవాత నయన్ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ప్రభుదేవ సింగిల్ గా ఉన్నాడని అంతా అనుకున్నారు. కానీ ప్రభుదేవ కరోనా లాక్ డౌన్ సమయంలో హిమానిని వివాహం చేసుకున్నాడు. అయితే ప్రభుదేవ వివాహం చేసుకున్న సంగతి ఎవ్వరికీ తెలియదు.
కానీ ప్రభుదేవ పుట్టిన రోజు సంధర్బంగా హిమానిని ఆయన కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ప్రభుదేవ తన జీవితంలోకి రావడం అదృష్టం అని చెప్పింది. ఇక తాజాగా ప్రభుదేవ హిమానిని కలిసి తిరుమలలో సందడి చేశారు. ఇక హిమానిని ఇండస్ట్రీకి చెందినవారు కాదు. వృత్తిరిత్యా ఆమె డాక్టర్. ప్రభుదేవ బ్యాక్ పెయిన్ కోసం హిమానిని వద్దకు వెళ్లగా అక్కడే వీరిద్దరూ ప్రేమలోపడ్డారు. ఆ తరవాత పెళ్లి చేసుకున్నారు.