Home » పుష్ప- 2 నుండి మ‌రో లీక్…ఆ సీన్ కు గూస్ బంప్స్ ప‌క్కా…?

పుష్ప- 2 నుండి మ‌రో లీక్…ఆ సీన్ కు గూస్ బంప్స్ ప‌క్కా…?

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వ‌చ్చిన పుష్ప సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేశారు. కాగా ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి. మొదటి రోజు ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన‌ప్ప‌టికీ మెల్లిమెల్లిగా స్లో పాయిజిన్ లా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎక్కిపోయింది. తెలుగులో కంటే బాలీవుడ్ లోనే ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించింది.

Advertisement

ఈ సినిమాకు ఫిదా అయిన క్రికెట‌ర్ లు సైతం ఆట మధ్య‌లో పుష్ప మ్యాన‌రిజం చూపించ‌డం విశేషం. ఈ సినిమాలో మ‌రో హైలెట్ ఊ అంటావా మామా పాట. స‌మంత స్టెప్పులు వేసిన ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇక పుష్ప ఫ‌స్ట్ పార్ట్ లో అల్లు అర్జున్ ఎలా ఎదుగుతాడు అని చూపించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ వేగంగా జ‌రుపుకుంటోంది.

Advertisement

ఇప్ప‌టికే పుష్ప పార్ట్ 2 నుండి అల్లు అర్జున్ పోస్టర్ ను విడుద‌ల చేశారు. ఆ పోస్టర్ లో అల్లు అర్జున్ చీర‌క‌ట్టులో ఊర‌మాస్ లుక్ లో క‌నిస్తున్నాడు. అంతే కాకుండా వెర్ ఈజ్ పుష్ఫ అంటూ మ‌రో వీడియోను కూడా చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది ఆ వీడియో కూడా నెటిజన్ ల‌కు తెగ‌న‌చ్చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర లీక్ ఒక‌టి భ‌య‌ట‌కు వ‌చ్చింది. సినిమాలో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇంట‌ర్వెల్ సీన్ కు ముందు ఉండే ఫైట్ నే సుకుమార్ 35 రోజులు షూట్ చేయ‌బోతున్నారట‌. ఈ ఫైట్ సీన్ కు థియేట‌ర్ లో గూస్ బంప్స్ ప‌క్కా అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు. మ‌రి ఈ యాక్ష‌న్ సీన్ ఏ రేంజ్ లో ఉందో తెలియాలంటే సినిమా విడుద‌ల అయ్యేవర‌కూ వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading