సినిమా ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీస్ లో అక్కినేని ఫ్యామిలీ మరియు దగ్గుబాటి ఫ్యామిలీలు కూడా ఉంటాయి. ఈ రెండు కుటుంబాల నుండి స్టార్ హీరోలు ఉన్నారు. ఇక ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు మరియు దగ్గుబాటి రామానాయుడు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఈ క్రమంలోనే ఏఎన్ఆర్ తనకు కోడలిగా రామానాయుడు కుమార్తె లక్ష్మిని నాగార్జునకు ఇచ్చి వివాహం జరిపించారు.
ఇవి కూడ చదవండి : 10th మెమో పోయిందా.. ఇలా పొందండి సింపుల్ గా..!
కానీ లక్ష్మి అప్పటికే అమెరికాలో చదువుకున్నారు. ఇండియాకు రావడం ఇష్టం లేకపోయినప్పటికి బలవంతంగా వచ్చి నాగార్జునను వివాహం చేసుకున్నారు. పెళ్లి తరవాత మళ్లీ నాగార్జునతో అమెరికాలోనే సెటిల్ అవుదామని చెప్పారట. కానీ నాగార్జున ఇక్కడ సినిమాలు చేస్తుండటంతో విదేశాలకు రాలేను అని చెప్పారట. అయితే అప్పటికే నాగచైతన్య పుట్టాడు.
ఇవి కూడ చదవండి : జాతీయగీతం పడుతున్న కిషన్ పై పాకిస్థాన్ తుమ్మెద దాడి..!
అయిన్పటికీ లక్ష్మి నాగార్జునలు విడాకులు తీసుకున్నారు. చైతూ చిన్నప్పుడు తన తల్లి వద్దనే పెరిగాడు. కానీ వయసకు వచ్చిన తరవాత తండ్రి వద్దకు వచ్చి యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. జోష్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా నాగ్ విడాకుల తరవాత హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
కాగా లక్ష్మి కూడా విడాకుల తరవాత మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. తరవాత ఆ దంపతులకు కూడా ఓ కుమారుడు పుట్టాడు. అలా చైతూకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు కూడా ఉన్నాడు. ఇప్పటికే అతడి పెళ్లి కూడా జరిగిపోయింది. అంతే కాకుండా చైతూ రెండో తమ్ముడు సినిమాల్లోకి రాకుండా వ్యాపార రంగంలో రాణిస్తున్నట్టు సమాచారం.
ఇవి కూడ చదవండి : మీ శరీరం, నోటి నుంచి దుర్వాసన వస్తుందా..? ఇలా చేస్తే మటుమాయం..!