Home » ఫ్లాప్ టాక్ తో మొద‌లై చివ‌రికి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన మ‌హేశ్ బాబు సినిమా ఏదో తెలుసా..!

ఫ్లాప్ టాక్ తో మొద‌లై చివ‌రికి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన మ‌హేశ్ బాబు సినిమా ఏదో తెలుసా..!

by AJAY
Ad

సూపర్ స్టార్ కృష్ణ న‌ట‌ వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. హీరో గా ఎంట్రీ ఇవ్వక ముందే మహేష్ బాబు బాల నటుడిగా ప్రేక్షకులను అలరించారు.

Advertisement

ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. దాంతో మహేష్ బాబుకు ఎంతో మంది అభిమానులు అయ్యారు. ఏజ్ పెరిగినా అందం చెర‌గ‌ని హీరోగా మహేష్ బాబు అమ్మాయిల మనసు దోచుకున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో లవర్ బాయ్స్ కి మాత్రమే అమ్మాయిలు అభిమానులు ఉంటారు.

మహేష్ బాబు మాస్ హీరో అయినప్పటికీ అమ్మాయిల ఫాలోయింగ్ లో లవర్ బాయ్ హీరోలకంటే ఏమీ తక్కువ కాదు. ఇదిలా ఉంటే మహేష్ బాబు హీరోగా నటించిన ఓ సినిమాకు మొదట ఫ్లాప్ టాక్ రాగా మెల్లి మెల్లిగా బ్లాక్ బస్టర్ టాక్ ను అందుకుంది. ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం… మహేష్ బాబు హీరోగా మూడో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దానికంటే ముందు సినిమా యావరేజ్ గా నిలిచింది. దాంతో నాలుగో సినిమా ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాలని మ‌హేశ్ బాబు నిర్ణయించుకున్నాడు.

mahesh

Advertisement

ఆ సమయంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మురారి తో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాని ఎంచుకోవడంతో మహేష్ బాబు ఖాతాలో మరో ఫ్లాప్ పడటం ఖాయం అని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు తండ్రి కృష్ణ కూడా ఈ సినిమా చేయవద్దని చెప్పాడు. కానీ మహేష్ బాబు మాత్రం అదే కథతో సినిమా చేస్తానని పట్టుబట్టారు. అలా ఎన్నో అడ్డంకుల మ‌ధ్య‌ ఈ సినిమా మొద‌ల‌య్యింది. ఇక ఈ సినిమాకు కుష్ణ వంశీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం 2001 సంవత్సరంలో ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట సినిమాలో మాస్ ఎలివేష‌న్స్ లేక‌పోవ‌డంతో కృష్ణ‌ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహ పడ్డారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది. దాంతో ఈవినింగ్ వరకు బుకింగ్స్ పెరిగిపోయాయి. మాస్ సెంటర్లలో కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈవినింగ్ షో కి వెళ్లి సినిమా చూశారట. అంతేకాకుండా ఆడియన్స్ రెస్పాన్స్ చూసి కృష్ణ షాక్ అయ్యాడట. ఈ సినిమాలో మహేష్ బాబు నటన చూసి కూడా కృష్ణ ఫిదా అయ్యారు. అలా మెల్లగా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Also Read: చైతూ ఒప్పుకుంటే మళ్లీ పెళ్లి చేసుకుంటా…వైర‌ల్ అవుతున్న స‌మంత కామెంట్స్..!

Visitors Are Also Reading