టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో సమంత కూడా ఒకరు. ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అయితే సమంత తన మొదటి సినిమా ఏం మాయ చేశావే సమయంలోనే నాగచైతన్య తో ప్రేమలో పడింది. ఆ తర్వాత 2017 లో ఇద్దరూ గోవాలో బంధువులు కుటుంబ సభ్యుల మధ్య లో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
Advertisement
ఇక ఐదేళ్ల వైవాహిక జీవితం తరవాత గతేడాది తము విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. ఇక అక్కినేని ఫ్యామిలీకి నచ్చని కొన్ని సినిమాలు చేయడం వల్లే సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని టాలీవుడ్ లో టాక్ వినిపించింది. మరోవైపు నాగ చైతన్య వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని వార్తలు కూడా వినిపించాయి.
Also read: విడాకుల తరవాత దారుణమైన పరిస్థితులు…వైరల్ అవుతున్న సమంత కామెంట్స్..!
Advertisement
ఇదిలా ఉంటే గతంలో సమంత సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ నెటిజన్ నాగచైతన్యకు విడాకులు ఇచ్చి సమంత నన్ను పెళ్లి చేసుకో అంటూ కామెంట్ పెట్టాడు. దానికి సమంత ఫన్నీగా…. చేసుకుంటాను కానీ ముందు చైతూను ఒప్పించాలి అంటూ రిప్లై ఇచ్చింది.
అయితే ప్రస్తుతం సమంతా చేసిన కామెంట్స్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా సమంత రీసెంట్ గా పుష్ఫ సినిమాలో ఊ అంటావా ఊఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ కు స్టెప్పులు వేసింది. ఈ పాటతో సమంత సోషల్ మీడియాను షేక్ చేసింది. బాలీవుడ్ స్టార్ లు సైతం సమంత పుష్పలో వేసిన స్టెప్పులపై ప్రశంసలు కురిపించారు.
Also Read: భీమ్లా నాయక్ లో నిత్య, సంయుక్తల ల కంటే ముందు ఎవరిని సెలెక్ట్ చేసారో తెలుసా ?