Telugu News » Blog » ‘ఐరన్ లెగ్ శాస్త్రి’ కి సినిమాల్లో ఎలా అవకాశం లభించిందో తెలుసా? ఈవీవీవి గారు ఎలా తీసుకున్నారంటే ?

‘ఐరన్ లెగ్ శాస్త్రి’ కి సినిమాల్లో ఎలా అవకాశం లభించిందో తెలుసా? ఈవీవీవి గారు ఎలా తీసుకున్నారంటే ?

by AJAY
Published: Last Updated on
Ads

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో మంచి క‌మెడిన్ గా గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు ఐర‌న్ లెగ్ శాస్త్రి. ఎన్నో చిత్రాల్లో న‌టించి ఐర‌న్ లెగ్ శాస్త్రి ఆ త‌ర‌వాత ఇండ‌స్ట్రీలో క‌నుమ‌రుగ‌య్యారు. అనారోగ్యంతో క‌న్నుమూశారు. బ్ర‌హ్మానందంతో క‌లిసి ఐర‌న్ లెగ్ శాస్త్రి చేసిన కామెడీ ప్రేక్ష‌కుల‌కు ఇప్ప‌టికీ గుర్తుండి పోయింది. ఇప్పుడు ఆయ‌న చేసిన సినిమాలు చూసిన‌వారు కూడా క‌డుపుబ్బా న‌వ్వేస్తుంటారు. అతి త‌క్కువ కాలంలో ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న‌ ఐర‌న్ లెగ్ శాస్త్రి గురించి ప్రేక్ష‌కులకు ఎన్నో విష‌యాలు తెలియ‌వు.

iron leg sastry

iron leg sastry son

కాగా తాజాగా ఆయ‌న కుమారుడు ప్ర‌సాద్ ఓ ఇంట‌ర్వ్యూలో త‌న తండ్రి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…..ఐర‌న్ లెగ్ శాస్త్రి అస‌లు పేరు గుణుపూడి విశ్వ‌నాథ శాస్త్రి అని చెప్పారు. త‌న తండ్రి బ్రాహ్మ‌ణ కుటుంబంలో పుట్టార‌ని చెప్పారు. పురోహిత్యం ఆయ‌న వృత్తి అని చెప్పారు. అంతే కాకుండా ఐర‌న్ లెగ్ శాస్త్రికి చ‌దువు అబ్బ‌లేద‌ని దాంతో ఆయన ఏడో త‌ర‌గ‌తిలోనే చ‌దువు మానేశార‌ని అన్నారు.

పురోహిత్యం వృత్తిలో ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చార‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో సినిమాల‌కు ఓపెనింగ్ పూజ‌లు చేశేవార‌ని చెప్పారు. అలా పూజ‌లు చేస్తున్న స‌మయంలో ఓసారి ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు పూజ చేశాక హార‌తికి దండం పెట్టుకుంటూ ఉండ‌గా అది ఆరిపోయింద‌ని అన్నారు. ఈ సీన్ ఈవీవీకి ఫ‌న్నీగా అనిపించింద‌ని త‌న తండ్రి ప‌ర్స‌నాలిటీ కూడా సినిమాల‌కు సెట్ అవుతుంద‌ని అనుకున్నార‌ని చెప్పారు.

అలా ప్రేమ‌ఖైదీ సినిమాలో త‌న తండ్రికి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని చెప్పారు. ఈ సినిమాలో బ్ర‌హ్మానందం తో చేసిన కామెడీ సూప‌ర్ హిట్ గా నిలిచింద‌ని చెప్పారు. అలా ఏకంగా వందల సినిమాల‌తో పాటూ సీరియల్స్ లోనూ త‌న తండ్రి న‌టించార‌ని చెప్పారు. ఆ త‌ర‌వాత కొంత‌కాలానికి ఐర‌న్ లెగ్ శాస్త్రిని సినిమాలో పెట్టుకుంటే సినిమా ఫ్లాప్ అనే రూమ‌ర్ ను క్రియేట్ చేశార‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో నాన్న‌గారు చాలా బాధ‌ప‌డ్డార‌ని ఆయ‌న సినిమాల ద్వారా ఏమీ సంపాదించ‌లేద‌ని చెప్పారు.


You may also like