Home » BIGG BOSS OTT : హీరోయిన్ బిందు మాధవి గురించి ఎవరికీ తెలియని నిజాలు…!

BIGG BOSS OTT : హీరోయిన్ బిందు మాధవి గురించి ఎవరికీ తెలియని నిజాలు…!

by AJAY
Ad

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు ఓటిటి ప్రారంభం అయ్యింది. అయితే ఈ సారి టీవిలో కాకుండా బిగ్ బాస్ ఓటిటిలో 24 గంటల పాటు ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. అయితే ఈ సారి ఎక్కువ మందు గత సీజన్ల సభ్యులతో పాటు కొంతమంది కొత్తవాళ్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఓ హీరోయిన్ కూడా ఉంది.

Advertisement

ఆమె ఎవరో కాదు బిందు మాధవి….ఈ ముద్దుగుమ్మ ఆవకాయ్ బిర్యానీ, రామరామ కృష్ణ కృష్ణ, బంపర్ ఆఫర్ సినిమాల్లో నటించింది. కానీ ఆ తరవాత పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ తమిళ్ లో మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడం తో చెన్నై కి మకాం మార్చింది. అక్కడ 20కి పైగా సినిమాల్లో నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది.

Advertisement

అంతే కాకుండా తమిళ్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ 5 లో నిలిచింది. ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది. ఇక బిందు మాధురి ఏపీలోనే జన్మించగా ఆమె తండ్రి ఉద్యోగం వల్ల హైదరాబాద్, విజయవాడ లో నివసించింది. సినిమాల పై ఉన్న ఆసక్తితో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగమ్మాయి అయినప్పటికీ ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యింది.

ఇక ఇప్పుడు బిందు మాధవి మళ్లీ తెలుగులో సినిమాలు చేయాలని ఆశపడుతోంది. అందువల్లే తెలుగు వారికి మరింత దగ్గర అయ్యేందుకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు చెబుతుంది. ఇక కన్నడ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు అని అప్పుడు లవ్ ఫెయిల్యూర్ వల్ల డిప్రెషన్ లో ఉన్నా అని చెప్పింది. తమది చిత్తూరు జిల్లా మదనపల్లి అల్లి అని పేర్కొంది. ఇక బిగ్ బాస్ ఓటిటీ లో బిందు మాధవి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Visitors Are Also Reading