పుష్ఫ సినిమాలోని ఊ అంటావా పాటను పాడి మంగ్లీ సోదరి ఓవర్ నైట్ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మరోసింగర్ కూడా అలానే పాపులారీటీని సంపాదించుకుంది. ఆ సింగర్ పేరే ధీ. రీసెంట్ గా దసరా సినిమా నుండి చమ్కీల అంగీలేసి అనే పాటతో ధీ యూట్యూబ్ ను షేక్ చేసింది. ఈ పాటకు మిలియన్స్ కొద్దీ వ్యూవ్స్ వస్తున్నాయి.
Advertisement
మొదట ఈ పాట విన్న సంగీత ప్రియులు ధీ పక్కా తెలుగమ్మాయి అని అనుకున్నారు. కానీ ధీ పక్కా తెలుగమ్మాయి కాదు తమిళమ్మాయి. ధీ అసలు పేరు ధీక్షిత కాగా అందరూ ముద్దుగా ధీ అని పిలుచుకుంటారు. అదేవిధంగా ఆమె సోషల్ మీడియా ఖాతా పేరు కూడా ధీగానే ఉంటుంది. ధీ తండ్రి ప్రముఖ సంగీత దర్శకుడు నారాయణ్ కాగా ఆమె ఇండియాలోనే పుట్టినప్పటికీ ఆస్ట్రేలియాలో చదువుకుంది.
ALSO READ : జూనియర్ ఎన్టీఆర్ ను దెబ్బతీసేందుకు నందమూరి ఫ్యామిలీ కుట్ర ?
Advertisement
అంతే కాకుండా చిన్ననాటి నుండి మ్యూజిక్ అంటే ఎంతో అభిమానం ఉండటంతో 14 ఏళ్లకే సంగీతం నేర్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ధీ దసరా సినిమాలోని పాట మాత్రమే కాకుండా తెలుగులో చాలా సూపర్ హిట్ పాటలు పాడింది. గురు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్స్ లో ఓ సక్కనోడా పాట కూడా ఒకటి. ఈ పాటను ధీ నే పాడింది.
అదే విధంగా మారి 2 సినిమాలోని రౌడీ బేబీ పాటను కూడా ఈ అమ్మాయే పాడింది. ఈ రెండు పాటలు కూడా యూట్యూబ్ ను షేక్ చేశాయి. కానీ చమ్మీల అంగీలేసి పాట ఓ ఊపు ఊపుతూ ఉండటంతో ధీ ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అని నెటిజన్ లు తెగ వెతుకున్నారు. అంతే కాకుండా ఇప్పుడు ధీ క్రేజ్ తెలుగులో కూడా పెరగటంతో మరిన్ని అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
ALSO READ :మనోజ్ పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మోహన్ బాబు… భూమా మౌనికనే కారణమా?