Home » జూనియర్ ఎన్టీఆర్ ను దెబ్బతీసేందుకు నందమూరి ఫ్యామిలీ కుట్ర ?

జూనియర్ ఎన్టీఆర్ ను దెబ్బతీసేందుకు నందమూరి ఫ్యామిలీ కుట్ర ?

by Bunty
Ad

నందమూరి ఫ్యామిలీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి ఫ్యామిలీ పేరును శిఖర స్థాయిలో నిలిపారు సీనియర్ ఎన్టీఆర్. అప్పటి నుంచి ఇప్పటివరకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతోమంది ఆరాధిస్తుంటారు. అలా ఆయన ఫ్యామిలీ నుంచి మంచి గుర్తింపును సాధించిన వారిలో బాలకృష్ణ ఒకరు.. ఇక బాలకృష్ణ తర్వాత నందమూరి ఫ్యామిలీ అంటే గుర్తుకొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. మూడోతరం హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో గుర్తింపును సాధించారు.

read also : మనోజ్ పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మోహన్ బాబు… భూమా మౌనికనే కారణమా?

Advertisement

పాన్ ఇండియా స్థాయిలో నందమూరి పేరును మార్మోగిలా చేశారు.. ఇంతటి ఘనత సాధించింది సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే, తాజాగా నందమూరి కుటుంబంలో ఓ శుభా కార్యం జరిగింది. హరికృష్ణ కుమార్తె సుహాసిని కుమారుడైన శ్రీ హర్ష ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాదులో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ కి నందమూరి కుటుంబ సభ్యులు పలువురు హాజరయ్యారు. అలాగే సుహాసిని సోదరుడు కళ్యాణ్ రామ్ సతీసమేతంగా హాజరయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరుకాలేదు.

Advertisement

READ ALSO : రవితేజకు భార్య, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?

దీంతో మళ్లీ అనేక అనుమానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య కొడుకు అన్న విషయం తెలిసిందే. ఇక జానకిరామ్, సుహాసిని, కళ్యాణ్ రామ్ ముగ్గురు హరికృష్ణ మొదటి భార్య సంతానం. అయితే జూనియర్ ఎన్టీఆర్ మేనల్లుడు శ్రీ హర్ష ఎంగేజ్మెంట్ కి రాకపోవడంతో దీనికి ప్రధాన కారణం వారి మధ్య విభేదాలు అంటూ కొంతమంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంతమంది జూనియర్ ఎన్టీఆర్ కాస్త బిజీగా ఉండడం వల్లే రాలేకపోయారని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నీ దెబ్బతీసేందుకు నందమూరి ఫ్యామిలీ కుట్ర పన్నిందని మరికొంతమంది అంటున్నారు.

READ ALSO : TSPSC రద్దు చేసిన మొత్తం పరీక్షల లిస్టు ఇదే.. వాయిదా పడ్డ పరీక్షలేవంటే..

Visitors Are Also Reading