Home » ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ భార్య ప్ర‌ముఖ‌ టాలీవుడ్ న‌టి అన్న సంగ‌తి తెలుసా..? ఎవ‌రంటే..!!

ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ భార్య ప్ర‌ముఖ‌ టాలీవుడ్ న‌టి అన్న సంగ‌తి తెలుసా..? ఎవ‌రంటే..!!

by AJAY
Published: Last Updated on
Ad

రాజ‌మౌళి సినిమాల్లో ఛాన్స్ కొట్టేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. కానీ న‌టుడు చంద్ర‌శేఖర్ కు రాజ‌మౌళి తెర‌కెక్కించే అన్నిసినిమాల్లో అవకాశం ద‌క్కుతుంది. చంద్ర‌శేఖ‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఛ‌త్ర‌ప‌తి సినిమాతోనే పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో ప్ర‌భాస్ స్నేహితుడిగా న‌టించ‌గా శేక‌ర్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు అందాయి. అయితే మిగ‌తా ద‌ర్శ‌కుల సినిమాల్లో మాత్రం చంద్ర‌శేఖ‌ర్ కు పెద్ద‌గా అవ‌కాశాలు ద‌క్క‌లేదు. ఇప్పుడైతే చంద్ర‌శేక‌ర్ టీవీ సీరియ‌ల్స్ లో న‌టిస్తున్నారు.

Advertisement

 

నిజానికి చంద్ర‌శేఖ‌ర్ తో రాజ‌మౌళి సీరియ‌ల్స్ తీస్తున్న‌ప్ప‌టి నుండే ప‌రిచ‌యం ఉందట‌. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య ఉండే స్నేహం వ‌ల్లే ప్ర‌తిసారి రాజ‌మౌళి పిలిచి మ‌రీ అవ‌కాశాలు ఇస్తుంటారని ఇటీవ‌ల చంద్ర‌శేఖ‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో మ‌ల్లి తండ్రిగా న‌టించే అవ‌కాశం రావ‌డంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌ని చెప్పారు. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియాకు కూడా చంద్ర‌శేక‌ర్ ప‌రిచ‌యం అయ్యారు.

Advertisement

ఇదిలా ఉంటే చంద్ర‌శేక‌ర్ భార్య కూడా సినిమాలు చేస్తార‌నే సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. చంద్ర‌శేక‌ర్ భార్య నిలియ భ‌వాని చాలా సినిమాల‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. ర‌వితేజ హీరోగా న‌టించిన కిక్ 2 సినిమాలో కూడా న‌టించి అల‌రించింది. నాని హీరోగా న‌టించిన జెంటిల్ మాన్, సైరా న‌ర‌సింహారెడ్డి లాంటి సినిమాల‌లో కూడా న‌టించి ఆక‌ట్టుకున్నారు.

నిలియా భ‌వానిని చంద్ర‌శేక‌ర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిలియా భ‌వాని స్వ‌గ్రామం ఖ‌మ్మం జిల్లా కాగా చంద్ర‌శేక‌ర్ తో ప్రేమ‌లో ప‌డింది. కానీ ఆమె త‌ల్లిదండ్రులు ఒప్పుకోక‌పోవ‌డంతో ఇద్ద‌రూ హైద‌రాబాద్ కు వ‌చ్చి పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర‌వాత‌నే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన శాంతినివాసం సీరియ‌ల్ న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. అలా రాజ‌మౌళితో చంద్రశేక‌ర్ కు ప‌రిచ‌యం ఏర్ప‌డి ఇప్ప‌టికీ క‌లిసి సినిమాలు చేస్తున్నారు.

Visitors Are Also Reading