సెలబ్రిటీ జంటలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో… ఎప్పుడు విడిపోతారో ఎవరు ఊహించలేరు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. గత ఏడాది చాలామంది సెలబ్రిటీలు తమ విడాకులను ప్రకటించారు. హీరో దనుష్ తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. అంతేకాకుండా సమంత నాగచైతన్యలు కూడా విడాకులు తీసుకున్నారు. అదేవిధంగా అమీర్ ఖాన్ తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది.
Also Read: పెళ్లి సమయంలో ఎన్టీఆర్ అన్ని కోట్ల కట్నం తీసుకున్నారా..? వయసు విషయం ఎందుకు హాట్ టాపిక్ గా మారిందంటే..?
Advertisement
ఇక రీసెంట్ గా బాలీవుడ్ జంట దీపిక పదుకొనే రన్వీర్ సింగ్ విడాకులు తీసుకుంటున్నారంటూ జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది. అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్యారాయ్ తో విడిపోతున్నట్టుగా వార్త వినిపిస్తున్నాయి.
Advertisement
త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరి విడాకులపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ గతంలో అభిషేక్ బచ్చన్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. గతంలో అభిషేక్ బచ్చన్ ఐశ్వరరాయ్ విడిపోతున్నారు అంటూ వార్తలు రావడంతో అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. తన ట్వీట్లో అభిషేక్….. నేను విడాకులు తీసుకోబోతున్నాను అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.
దానికి నేను సిద్ధమే…. అదే విధంగా నాకు రెండో పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మీదే… అది మర్చిపోకండి. అంటూ వ్యంగంగా స్పందించాడు. దాంతో ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్య రాయ్ గురించి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ…. ఐశ్వర్యరాయ్ తో నా జీవితాన్ని ఎలా నడిపించాలో నిర్దేశించడానికి మూడో వ్యక్తి అవసరం లేదు. నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆమెకు తెలుసు. ఆమె ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు అంటూ కామెంట్ చేశాడు. ఇక అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ 2007 సంవత్సరం ఏప్రిల్ 20న పెళ్లి చేసుకున్నారు. 2014లో వీరికి ఆరాధ్య జన్మించింది. మరి ప్రస్తుతం వస్తున్న విడాకుల వార్తలపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: ఆదిపురుష్ సినిమాకి హిందీలో ప్రభాస్‌కి వాయిస్ ఇచ్చింది ఎవరో తెలుసా..?