Home » Gruhalakshmi ఏప్రిల్ 22 (ఈరోజు) ఎపిసోడ్ : అమ్మ వద్ద నుంచి అత్త ద‌గ్గ‌రికి వెళ్లిన అభి..!

Gruhalakshmi ఏప్రిల్ 22 (ఈరోజు) ఎపిసోడ్ : అమ్మ వద్ద నుంచి అత్త ద‌గ్గ‌రికి వెళ్లిన అభి..!

by Anji
Ad

క‌ష్టంలో ఉన్న అమ్మ‌కు సాయంగా ఉంటే తన కెరియ‌ర్ అక్క‌డే ఆగిపోతున్న‌ద‌ని.. అమ్మ‌కు తోడుగా ఉండ‌డం క‌న్నా త‌న కెరియ‌ర్ ముఖ్య‌మ‌నుకున్నాడు అభి. కొడుకు భ‌విష్య‌త్ కోసం ఆలోచించిన తుల‌సి అత‌ను కోరుకున్న జీవితం ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డుతుంది. ఇవాళ ఈ ఎపిసోడ్‌లో ఏమైదంటే..? సీతారాముల క‌ల్యాణంలో భాగంగా తుల‌సి అభి, అంకిత‌ల‌తో పూజా చేయిస్తుంటుంది. పెద్ద కోడ‌లు హోదాలో దీపం వెలిగించి పూజా ప్రారంభం చేస్తుంది అంకిత. ఆ త‌రువాత‌.. రామా.. రామా.. రామ జ‌య సీతారామ అంటూ పాట‌లు పాడి రామ కీర్త‌న చేస్తారు. ఒక‌రిత‌రువాత మ‌రొక‌రు పాట‌లు పాడుతారు. ఇంత‌లోనే అభికి పెద్ద డౌట్ వ‌స్తుంది. రాముడిని గొప్ప‌వాడ‌ని అంద‌రూ అంటారు ఎందుకు అని తుల‌సిని అడుగుతాడు. తుల‌సి శ్రీ‌రాముడి గొప్ప‌త‌నం గురించి చెబుతుంది.

Advertisement

ముఖ్యంగా ఏ త‌ల్లిదండ్రులు అయినా రాముడు లాంటి కొడుకు కావాల‌నే కోరుకుంటారు. కార‌ణం అడ‌క్కుండా స‌తీస‌మేతంగా వ‌న‌వాసం చేసాడు. ప్ర‌స్తుత ప‌రిస్థితికి లింక్ చేసి చెబుతుంది తుల‌సి. వ‌న‌వాసం అనేది రామాయ‌ణంలో బ్యాడ్ చాప్టర్ క‌దా.. అది అప్పుడు ఎందుకు చెబుతున్నావు మామ్‌.. అది కూడా అన్న‌య్య‌తో ఎందుకు చెబుతున్నావని దివ్య అడ‌గ‌గా తుల‌సి అభి వైపు అదేప‌నిగా చూస్తుంటుంది. అన‌సూయ‌.. ఏమైంద‌మ్మా.. ఎందుకు అలా ఉన్నావు.. ఉద‌యం నుండి నువ్వు నీలా లేవు ఎందుకు అలా ఉన్నావ‌ని అడుగుతుంది. ప‌రిస్థితులు న‌న్ను అలా ఉండేట్టు చేస్తున్నాయి. అత్త‌మ్మా ని మ‌న‌సులో అనుకుంటుంది. ఆ త‌రువాత ప్ర‌సాదం పంప‌కాల‌తో పూజ కార్య‌క్ర‌మం ముగుస్తుంది. కొడుకు అభి ఫోన్‌లో త‌న ప్యూచ‌ర్ గురించి మిత్రుడితో మాట్లాడిన మాట‌ల‌ను తుల‌సి త‌ల‌చుకుంటూ ఉంటుంది. నిన్న మొన్న జ‌రిగిన సీన్ల‌ను తుల‌సి గుర్తు చేసుకోవ‌డంతో నేటి సీరియ‌ల్‌ను సాగ‌దీశారు.

ఇక ఇంట్లో వాళ్లంద‌రూ సంతోషంగా ఉంటే.. తుల‌సి మాత్రం దిగులుగా ఉండ‌డాన్ని గ‌మ‌నిస్తారంద‌రూ.. గుమ్మం ద‌గ్గ‌రే ఉన్నావు ఎందుక‌మ్మా అని అన‌సూయ అడ‌గ‌గా.. ఓ ముఖ్య‌మైన అతిథి కోసం ఎదురుచూస్తున్నాన‌ని చెబుతుంది తుల‌సి. ఇంత‌లో అంకిత త‌ల్లి వ‌చ్చి ఎప్పుడు లేనివిధంగా తుల‌సితో ప్ర‌వ‌ర్తిస్తుంది. సారీ తుల‌సి కాస్త లేటు అయిందంటుంది. ఆ త‌రువాత ఇద్ద‌రూ క‌లిసి చాలా సేపు మాట్లాడుకుంటారు.న అది చూసిన అభి, అంకిత‌ల‌లో కంగారు మొద‌ల‌వుతుంది. రండి వ‌దినా అంటూ గాయ‌త్రిని ఇంట్లోకి తీసుకుని వ‌స్తుంది తుల‌సి. ఎదురుగా ఉన్న అంకిత‌ను మీ అమ్మ‌ను ప‌ల‌క‌రించ‌మ్మా అనిఅంటుంది. దీంతో అంకిత ప‌లుక‌రించ‌క‌పోతే మా మ‌మ్మీకి ఏం తేడా ఉండ‌దు. త‌న మాట నెగ్గించుకోవ‌డం త‌ప్ప మ‌ర్యాద‌తో ప‌ని లేద‌ని పేర్కొంటుంది అంకిత‌. ఇక ఆ మాట‌తో గాయ‌త్రి అస‌లు నిజం బ‌య‌ట‌పెడుతుంది.

నా కూతురుని, అల్లుడిని నాతో పంపిస్తాన‌ని చెప్పి ఈ డిస్క‌ష‌న్ ఏమిటి అని అడుగుతుంది. ఆ మాట‌తో ఇంట్లో ఉన్న వారంద‌రూ షాక్ అవుతారు. పాపం అన‌వ‌స‌రంగా వాళ్ల‌ను టెన్ష‌న్ పెడుతున్నావు ఓపెన్ గా చెప్పేయ‌చ్చు క‌దా.. స‌రే నువ్వు చెప్ప‌లేవు లే కానీ.. నేను చెబుతా.. నాతో నా అల్లుడు కూతురిని ఫ‌ర్మినెంట్‌గా పంప‌డానికి తుల‌సి ఒప్పుకుంది. తీసుకుని వెళ్ల‌డానికి ర‌మ్మంద‌ని నిజం బ‌య‌ట‌పెడుతుంది. ఆ మాట విన్న అన‌సూయ ఏమిటి తుల‌సి ఆమె చెప్పేది వాస్త‌వ‌మేనా..? వాడేమ‌న్నా సంత‌లో గొర్రెపిల్ల అనుకున్న‌వా..? బేరం పెట్టి పంపించ‌డానికి అని అంటుంది. ఇంత‌లో అభి వ‌చ్చి నాతో ఒక్క మాట కూడా చెప్ప‌లేదేమిటి మామ్ అని అడుగుతాడ‌. దివ్య వంతు రావ‌డంతో కాస్త భారీ డైలాగ్‌లు వేస్తుంది. ఏంటి మామ్‌.. ఇది చెప్ప‌కుండా నువ్వు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుకున్నావ‌నే డాడీ ఇల్లు వ‌దిలెల్లిపోయాడు. నువ్వు మార‌లేద‌ని నిల‌దీస్తుంది.

Advertisement

ఆ ఆలోచ‌న మ‌నుసులోకి వ‌చ్చింది నిజ‌మే కానీ.. అంటూ ఏదో చెప్ప‌బోతుంటాడు అభి. నీకు ఇష్ట‌మే కానీ న‌న్ను వ‌దిలి వెళ్ల‌డానికి మొహ‌మాట ప‌డుతున్నావు అంతే క‌దా..? మీ అత్త‌గారు చెప్పిన‌ట్టు వింటే నీ భవిష్య‌త్ బాగుంటుంద‌ని అనుకున్న‌ప్పుడు నా కోసం ఎందుకు ఆలోచిస్తావు అని అంటుంది తుల‌సి. అది ఆలోచ‌న మాత్ర‌మే నిర్ణ‌యం కాదు మామ్ అని అంటాడు. ఆ మాట‌తో తుల‌సి అలాంటప్పుడు మీ అత్త ఇచ్చిన ఇంటి కీస్ ఎందుకు తీసుకుని వ‌చ్చావ్ ఇప్పుడు ఎందుకు వెన‌క‌డుగు వేస్తున్నావు అని అడ‌గ‌డంతో అభి ఏం చెప్ప‌లేక ఏడుస్తూ అంకిత ద‌గ్గ‌ర‌కు వెళ్లి నువ్వైనా చెప్పు అంకిత మ‌న‌కు వెళ్ల‌డం ఇష్టం లేద‌ని చెప్పు అని అంటాడు. వెళ్ల‌డం నాకు ఇష్ట‌మే అని అంకిత క‌న్నీరు పెట్టుకుంటుంది.

 

నా మ‌న‌సులో మాట చెప్ప‌మ‌న్నావ్‌.. నేను చెప్పాను. నిర్ణ‌యం తీసేసుకున్నా మా జీవితానికి సంబంధించిన విష‌యం ఇది అని అంకిత అన‌డంతో మీ స్వార్థం కోసం తుల‌సిని ఒంట‌రిదానిని చేసి వెళ్లిపోతావా..? కొడుకుగా చూసుకోవ‌డం అని బాధ్య‌త అని అన‌సూయ లాజిక్‌లు మాట్లాడ‌డంతో గాయ‌త్రి దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇస్తుంది. కొడుకు త‌ల్లిని చూడ‌డం బాధ్య‌త అయిన‌ప్పుడు కొడుకు మిమ్మ‌ల్ని వ‌దిలేసి ఎందుకు వెళ్లిపోయాడు. ఈ సూక్తి ముక్తావ‌ళి అత‌నికి ఎందుకు వినిపించ‌లేదు. ఇప్పుడు తుల‌సి కూడా అదే చేస్తుంద‌ని పేర్కొంటుంది. ఆ మాట‌తో అభి మా అమ్మ ఇష్టంతో మ‌మ్ములను పంపించ‌డం లేదంటే.. బ‌ల‌వంతంగా పంపిస్తుంద‌ని అంటాడు. బంల‌వంతం అంటే ఇది కాదు అభి ప్రేమ్‌ను పంపించింది చూడా అది బ‌ల‌వంతం అంటే.. ఈ ఇంటి గ‌డ‌ప దాట‌డానికి అంకిత ఒప్పుకుంది. మ‌రి స‌మ‌స్య ఏంట‌ని అంటుంది గాయ‌త్రి.

ఎప్పుడు తుల‌సి ఆంటీని విడిచి పెట్ట‌ను అన్నావు. గ‌డ‌ప‌దాట‌న‌న్నావు. ఇంత‌లో ఈ నిర్ణ‌యం ఎలా తీసుకున్నావు. నీ మ‌న‌సు మారింది ఎందుకు..? అభి నిన్ను అడ్డం పెట్టుకుని నాట‌కం ఆడిస్తున్నాడా..? మీరు ఇక్క‌డ ఉండ‌డం వ‌ల్ల కలిసి వ‌చ్చేది ఏం లేద‌ని పారిపోవ‌డానికి సిద్ధ‌మ‌య్యావు. పైకి ప్రేమ‌గా న‌టిస్తూ.. లోప‌ల ఇంత స్వార్థం పెట్టుకున్నావా..? నువ్వు త‌ల్లి కొడుకుల‌ను విడ‌దీస్తున్నావు అని గుర్తు పెట్టుకో అని అంకిత‌ను నానా మాట‌లు అంటాడు ప‌రందామ‌య్య‌. తుల‌సి ఇక ఆపండి మామ‌య్య అని తుల‌సి అన‌డంతో నువ్వు అన‌లేని మాట‌ల‌ను మీ మామ‌య్య‌తో అనిపించి.. ఇప్పుడు తీరిక‌గా మామ‌య్య అంటున్నావా తుల‌సి అని గాయ‌త్రి ఫైర్ అవుతుంది. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో అభి.. తుల‌సి నిర్ణ‌యాన్ని క‌ట్టుబ‌డి అత్త పంచ‌న చేర‌డానికి సిద్ధం అవుతాడు. బ్యాగ్ తీసుకుని అమ్మ ద‌గ్గ‌ర నుంచి అత్త ద‌గ్గ‌ర వెళ్తూ క‌నిపిస్తాడు.

ఇవి కూడా చదవండి :

  1. Chanakya Niti : మ‌నిషిని విజ‌య‌ప‌థంలోకి తీసుకెళ్లే ఐదు సూత్రాలు ఇవే..!
  2. మొదటి భార్య అనితతో దిల్ రాజుకు గొడవలు…ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు…!
  3. ఆ హీరోయిన్ అంటే కోట శ్రీనివాసరావుకు చాలా ఇష్టమట.. కానీ ఏం చేస్తాం..!!
Visitors Are Also Reading