తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాదులోని ప్రముఖ నెహ్రూ జూలాజికల్ పార్కులో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటివరకు స్టార్ అట్రాక్షన్ గా నిలిచిన అబ్దుల్లా అనే చిరుత పులి మృతి చెందింది. అబ్దుల్లా వయసు 15 ఏళ్ళు. ఈ చీతా హఠాత్తుగా మరణించడంతో అనుమానం వచ్చిన జూ అదికారులు పోస్టుమార్టం నిర్వహించారు. అబ్దుల్లా అనే ఈ చిరుత పులి గుండెపోటుతో మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.
READ ALSO : కోలీవుడ్ స్టార్ హీరో తో మీనా రెండో పెళ్లి..?
Advertisement
ఇక హైదరాబాద్ జూలో బతికి ఉన్న చివరి చిరుత పులి కూడా ఇక మరణించడంతో ఇటు అధికారులతో పాటు జంతు ప్రేమికులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అబ్దుల్లా అనే ఈ చిరుత పులి భారత్ కు చెందినది కాదు. 2011లో సౌదీ రాజా కుటుంబీకులు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించిన సమయంలో రెండు చిరుతపులులను కానుకగా ఇచ్చారు. ఒక ఆడ చిరుత పులి, మరొకటి మగ చిరుత పులి.
Advertisement
READ ALSO : మా పని మనుషుల కాళ్ళు మొక్కుతా – రష్మిక
ఆడ చిరుత పులి పేరు హీబా. హీబా అబ్దుల్లాలు ఎంతో ప్రేమగా ఉండేవని జూ అధికారులు గుర్తు చేసుకున్నారు. ఒకదానిని విడిచి మరొకటి అసలు ఉండేటివి కాదని, అంతలా ఈ రెండింటి మధ్య ప్రేమ ఉండేదని చెప్పారు. ఇక ఆడ చిరుత పులి హీబా 2020 లాక్ డౌన్ సమయంలో మరణించిన తర్వాత అబ్దుల్లా అనే ఈ మగ చిరుత పులి ఒంటరి అయింది. గత కొన్ని రోజులుగా కూడా యాక్టివ్ గా కనిపించలేదని కొందరు చెబుతున్నారు.
READ ALSO : Vande Bharat : తిరుపతి- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్..6 గంటలే ప్రయాణం