Home » మహేష్ బాబు సినిమాలో అమీర్ ఖాన్.. జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా..!

మహేష్ బాబు సినిమాలో అమీర్ ఖాన్.. జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా..!

by Anji
Ad

ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో పాన్ ఇండియా, మల్టీస్టారర్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోలందరూ రెండు కేటగిరిల సినిమాల వైపే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.  ఫిల్మ్ మేకర్స్ కూడా.. మార్కెట్ కలిసొస్తుందన్న ఉద్దేశంతో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్స్ ని కుదిర్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం. 

Advertisement

తన తదుపరి సినిమాలో మహేష్ బాబు, అమీర్ ఖాన్ ని ఒక ఫ్రేమ్ లో చూపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో  ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు నెలకొల్పిన రాజమౌళి.. తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలనుకున్నారు. కానీ RRR  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం వల్ల పాన్ వరల్డ్ చిత్రంగా మలిచేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే మహేష్ సినిమా కోసం అమీర్ ఖాన్ ని రంగంలోకి దింపనున్నట్టు టాక్ వినిపిస్తోంది. 

Advertisement

Also Read :  బుద్ధి మాంద్యం ఉన్న తెలుగు నటుల పిల్లలు..ఎవరంటే..?

Aamir Khan: మహేశ్ సినిమాలో ఆమిర్ ఖాన్.. డైరెక్టర్ వేసిన మాస్టర్ స్కెచ్? -  NTV Telugu

అతడినీ ప్రత్యేకంగా తీసుకోవడానికి కారణమనే చైనాలో అయితే అమీర్ ఖాన్ కి అనూహ్యమైన మార్కెట్ ఉంది. అతని సినిమాలు అక్కడ ఎన్నో సంచలనాలు సృష్టించాయి. అతడిని తీసుకుంటే.. చైనా మార్కెట్ కలిసొస్తుందనే ఉద్దేశంతో జక్కన్న ఈ ప్లాన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో అమీర్ ఖాన్ ని తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన పలు అవార్డులను అందుకోవడంగా చాలా బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అతడు, ఖలేజా సినిమాల తరువాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరి. 

Also Read :  బాబుకి జన్మనిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రెండో భార్య.. మొదటి భార్య ఏమంటుందంటే..? 

Visitors Are Also Reading