Home » నా భర్త మగాడు కాదని కేసు పెట్టిన మహిళ… ఇందులో అసలు ట్విస్టు ఏంటంటే..?

నా భర్త మగాడు కాదని కేసు పెట్టిన మహిళ… ఇందులో అసలు ట్విస్టు ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నేను పెళ్లి చేసుకున్న భర్త మగాడు కాదని సర్జరీ చేయించుకున్న మహిళ అని, ఆ రహస్యాన్ని దాచి తనకు అన్యాయం చేశారంటూ ఓ మహిళ వివాహమైన ఎనిమిది సంవత్సరాలకు పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ వ్యవహారంలో తన భర్త ముందుగానే మీడియా ముందుకు వచ్చాడు. ఆయన ఏమన్నారంటే.. నేను మొగాన్ని కాదు అనే విషయం నా భార్యకు ముందే తెలుసని అంటున్నారు డాక్టర్ విరాజ్ వర్ధన్ .. అంతేకాకుండా తాను లింగ మార్పిడి సర్జరీకి వెళ్తున్న విషయం కూడా ఆమెకు తెలుసని భార్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు.

also read:

Advertisement

Advertisement

 

ఆమె మరియు ఆమె బిడ్డ తనకు ఎంతో దగ్గరయ్యారని ఆమె కూతుర్ని నేను దత్తత కూడా తీసుకున్నానని ఆయన మీడియా సందర్భంగా తెలియజేశారు. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కలుసుకొని, వివాహం చేసుకున్నా మన్నారు. అన్నీ తెలిసి నన్ను మ్యారేజ్ చేసుకొని తొమ్మిది సంవత్సరాల తర్వాత నేను మొగాన్ని కాదంటూ నాటకాలు ఆడుతోందని, దీనికి ప్రధాన కారణం నా పేరు మీద ఉన్న ఇల్లు తను రాయించు కోవాలని చూస్తోందని అన్నారు. వివాహం అయినప్పటి నుంచి మేము ఎంతో అన్యోన్యంగా ఉన్నామని తెలియజేశారు. కానీ గత ఏడాది నుంచి వేర్వేరు గదుల్లో పడుకుంటున్నామని ఆమె నా గదిలో సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసి రహస్య ఫోటోలు తీయడం ప్రారంభించిందని, ఏప్రిల్ నెలలో తన సోదరిన్ని పిలిపించుకొని ఆ ఫోటోలు చూపించి భయపెడుతూ ఆస్తి తన పేరిట రాయాలని బ్లాక్మెయిల్ చేసిందని చెప్పారు.

తను పుట్టుకతో మహిళ అని తెలిపిన విరాజ్ పెళ్లికి ముందే ట్రాన్స్జెండర్ అయ్యానని, ప్రస్తుతం పురుషుడిగా మారేందుకు సర్జరీలు చేయించుకుంటున్నానని మీడియా ముందు ఒప్పుకున్నారు. గుజరాత్ వడోదరకు చెందిన సదరు మహిళకు గతంలో పెళ్లై ఒక కూతురు కూడా ఉంది. తన భర్త చనిపోయాక 2014 మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఢిల్లీకి చెందిన డాక్టర్ విరాజుతో వివాహం జరిగింది. తన భర్త మగాడు కాదని ఆపరేషన్ ద్వారా మారిన స్త్రీ అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది.

also read:

Visitors Are Also Reading