బుల్లితెర సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్ గురించి తెలియని వారు ఎవ్వరు ఉండరు. మొబైల్ చేతిలో ఉన్నదంటే చాలా మంది కాలక్షేపానికి జబర్దస్త్ పెట్టుకొని తప్పక చూస్తుంటారు. ఇక ఇందులో కమెడీయన్స్ వేసే పంచ్‌లు, పేల్చే జోకులు విని చాలా మంది మనశ్శాంతిని పొందుతారు. ఉరుకుల పరుగుల జీవితంలో జబర్దస్త్ కామెడీ షో చాలా మందికి ఒక రిలాక్సేషన్ మాదిరిగా పని చేస్తుంది. అన్ని షోల కంటే ఈ షో రేటింగ్ పరంగా టాప్‌లో కొనసాగుతుంది. జబర్దస్త్ షో చాలా మంది కమెడియన్స్ కి జీవితాన్ని ప్రసాదిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Advertisement
ఇది కూడా చదవండి : బుద్దిమాద్యం కలిగిన పిల్లలు ఉన్న టాలీవుడ్ స్టార్స్ గురించి మీకు తెలుసా..?
జబర్దస్త్ కామెడీ షో ప్రారంభించి ఇటీవల తొమ్మిది సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈటీవీ యాజమాన్యం ప్రత్యేకమైన ఈవెంట్ ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కమెడీయన్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ తరుణంలోనే జబర్దస్త్ కమెడీయన్ ధనరాజ్ తాజా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇప్పటివరకు కమెడీయన్‌గా ప్రేక్షకులను అలరించిన ధనరాజ్ ఇప్పుడు తాజాగా బుజ్జీ ఇలా రా అనే చిత్రంతో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనరాజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ధనరాజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నాడు.
Advertisement
ఈ చిత్రంలో యాక్టర్ కమ్ కమెడీయన్ సునీల్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర చేస్తున్నాడు. తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తొలి పరిచయమైన ఫ్రెండ్ ధనరాజ్ అని చెప్పాడు. మేమిద్దరం ఒరేయ్, బావ అని పిలుచుకునేంతగా మంచి స్నేహితులం అయ్యామన్నారు. ఇవాళ ధనరాజ్ నటించిన సినిమాకు వచ్చి ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఇది విన్న ధనరాజ్ ఎలా ఎమోషనల్ అయి.. వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : నాగార్జునతో అలా చేయటం వల్లే ఈ హీరోయిన్ కెరీర్ నాశనం అయిందా.. మళ్లీ నాగ్ ఛాన్స్ ఇస్తున్నారా..?