Home » 85 ఏళ్ల వయస్సులో కూడా పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు.. ఎందరికో ఆదర్శం..!

85 ఏళ్ల వయస్సులో కూడా పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు.. ఎందరికో ఆదర్శం..!

by Anji
Ad

అతను ఒక అవిశ్రాంత ఉపాధ్యాయుడు.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తన కాల పరిమితి అయిపోయిన గానీ తన  వృత్తి మీద ఉన్న ఆసక్తితో తన స్వగ్రామం అయిన సిద్దనేని గూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్య బోధిస్తూ పలువురు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచాడు. సాధారణంగా ఉద్యోగ విరమణ తరువాత విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈ అవిశ్రాంత ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయినప్పటికీ తాను బోధించే పాఠాలు పలువురు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటాయని, వారి జీవితాలకు పునాదులు వేస్తాయనే సంకల్పంతో విద్యా బోధనలు పలువురు విద్యార్థుల భవిష్యత్ కి మేలు జరుగుతాయనే ఆశయంతో అవిశ్రాంత ఉపాధ్యాయుడిగా తన జీవితం కొనసాగిస్తున్నాడు 85 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామారావు. 

Advertisement

ఖమ్మం జిల్లా మధిర మండలం సిద్ధినేని గూడెం గ్రామానికి చెందిన ఏడుకొండల రామారావు 1997లో తెలుగు ఉపాధ్యాయునిగా ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఖాళీగా ఉండకుండా తన స్వగ్రామం అయిన మధిర మండలం సిద్ధినేని గూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎలాంటి ఫలితం దక్కకుండా విద్యార్థులకు తెలుగు పాఠాలు బోధిస్తున్నారు. 1960లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధుల్లో చేరిన ఆయన ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా పని చేసి విద్యార్థుల ప్రజల మన్ననలను పొందారు. 85 ఏళ్ల వయస్సులో కూడా ఎలాంటి అలుపు లేకుండా విద్యార్థులకు అర్థం అయ్యేవిధంగా తెలుగు పాఠాలు బోధిస్తూ ముందుకు సాగుతున్నారు.

Advertisement

పాఠశాలలో విద్యార్థులకు బోధనకే పరిమితం కాకుండా పాఠశాలకు కావాల్సిన మౌళిక వసతులు కల్పించడం కోసం గ్రామంలోని దాతలను సమీకరించి పాఠశాలకు వసతులు కల్పించడం కోసం గ్రామంలోని దాతలను సమీకరించి పాఠశాలకు వసతులు సమకూర్చడంలో ఏడుకొండల రామారావు తనదైన శైలిలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.  అదేవిధంగా పాఠశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులకు అర్థం అయ్యే రీతిలో పాఠాలు బోధిస్తూ.. పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. 85 ఏళ్ల వయస్సులో కూడా ప్రతీ రోజు పాఠశాలకు సమయానిక ిరావడం.. విద్యార్థులకు పాఠాలు బోధించడం ఆయన చేస్తున్న సేవలను గ్రామస్తులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పలువురు అభినందిస్తున్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు విద్యార్థులకు పాఠాలు బోధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని రిటైర్డ్ మాస్టర్ రామారావు పేర్కొంటున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

 Hero Venkat : హీరో వెంకట్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

Visitors Are Also Reading