తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో విజయ్ దేవరకొండ అంటే తెలియని వారు ఉండరు. తక్కువ సినిమాలు చేసి ఎక్కువ అభిమానం సంపాదించుకున్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన మామూలు హీరో నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఇంతటి హీరో కావడానికి విజయ్ ఎంతో కష్టపడ్డారు. అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగాడు.
also read:లిఫ్టులో ఒంటరిగా 17ఏళ్ల అమ్మాయి..అందులోకి దూరిన ఇద్దరు యువకులు.. వీడియో చూస్తే..!!
Advertisement
చివరికి పెళ్లిచూపులు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, అర్జున్ రెడ్డి సినిమాతో తన టాలెంట్ చూపించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి ఇంకొన్ని చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన లైగర్ మూవీ విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ ఫ్లాప్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ ఎంత ఎదిగినా కానీ పేద ప్రజలకు ఫ్యాన్స్ కు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారట.
Advertisement
also read:TS Inter Results 2023 : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే…!
మిడిల్ క్లాస్ ఫండ్ పేరిట ఓ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఎన్నో మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడు. అలాంటి విజయ్ దేవరకొండ ఒకానొక సమయంలో పేద ప్రజలకు సాయం చేయడం కోసం తన అవార్డును కూడా అమ్మేశారట. అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్ కి బెస్ట్ యాక్టర్ ఫిలింఫేర్ అవార్డు దక్కింది. ఆ అవార్డును వేలం వేసి ఇరవై ఐదు లక్షల రూపాయలకు అమ్మేశాడు విజయ్. ఆ వచ్చిన డబ్బును ప్రజాసేవకై ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు.
also read:ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!