పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో నటించనున్నారు. రామాయణంలో కీలక పాత్ర అయినటువంటి రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు.
READ ALSO : ‘హిమాన్షు’ మరో అరుదైన ఘనత… మనవడికి సీఎం కేసీఆర్ ఆశీర్వాదం…
Advertisement
ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఇతిహాస చిత్రం ఆది పురుష్ అరుదైన గౌరవం దక్కించుకుంది. సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ దర్శకుడు ఓంరౌత్ హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
READ ALSO : విరూపాక్షలో ఈ అఘోరా పాత్ర హైలెట్ అవుతుందా…?
“ఇది గౌరవం, సంతోషానికి మించింది. 2023 జూన్ 13న ఆది పురుష్ న్యూయార్క్ లో జరిగే ఫెస్టివల్ లో ప్రదర్శితం అవుతుంది. ఈ సినిమాని ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. నా చిత్ర బృందానికి నేను కృతజ్ఞుణ్ణి ఆ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని ఓంరౌత్ తెలిపారు. ఆ వేడుక జూన్ 7 నుంచి 18 వరకు జరగనుంది.
READ ALSO : Agent : “ఏజెంట్” సినిమా ట్రైలర్…దుమ్ములేపిన అఖిల్