Home » ఏ.ఆర్. రెహమాన్ ఇస్లాంలోకి ఎందుకు మారారో మీకు తెలుసా ?

ఏ.ఆర్. రెహమాన్ ఇస్లాంలోకి ఎందుకు మారారో మీకు తెలుసా ?

by Anji
Ad

మ్యూజిక్ డైరెక్టర్  ఏ.ఆర్.రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  ఆస్కార్ అవార్డును అందుకొని ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.  ఇవాళ  లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు. రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

రెహమాన్ సంగీతం గురించి ఎంత చెప్పిన తక్కువే ఆయన పాటలు ఇప్పటికే ఎప్పటికి మారుమ్రోగుతూనే ఉంటాయి. ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించారు రెహమాన్. సంగీత రంగానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. రెండు ఆస్కార్ అవార్డులు గెలుగుకొని గుర్తింపు పొందాడు. ఆసియాలోనే తొలిసారిగా ఆస్కార్‌ను గెలుచుకున్న వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు రెహమాన్.రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్, తర్వాత ఇస్లాంలోకి మారారు. తన పేరును ఏఆర్ రెహమాన్ గా మార్చుకున్నాడు. అయితే ఆయన ఎందుకు ఇస్లాంలోకి ఎందుకు మారాడో గతంలో తెలిపారు. రెహమాన్ తండ్రి ఆర్కే శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మరణించిన తర్వాత రెహమాన్ సంగీత దర్శకుడిగా మారారు.

Advertisement

తన మొదటి ప్రాజెక్ట్ రోజా విడుదలకు కొంత సమయం ముందు తన కుటుంబంతో సహా ఇస్లాంను స్వీకరించాడు రెహమాన్. తన మత విశ్వాసాలను ఇతరులపై రుద్దడాన్ని రెహమాన్ నమ్మడు. సూఫీ మతం కుటుంబాన్ని ఆకర్షించింది, రెహమాన్ రోజా విడుదలకు ముందు, కుటుంబం ఇస్లాం మతంలోకి మారింది. అతని తల్లి కరీమా బేగం చివరి నిమిషంలో సినిమా క్రెడిట్లలో రెహమాన్ పేరును మార్చాలని పట్టుబట్టారు. దాంతో ఆయన పేరు రెహమాన్ గా ఉంటుంది. అప్పటి నుంచి రెహమాన్ గా ప్రసిద్ధి చెందారు. ఇస్లాంలోకి మారిన తర్వాత విజయవంతం కాగలరా అని చాలా మంది AR రెహమాన్‌ని అడుగుతారు కానీ దీని పై ఆయన ఎప్పుడూ స్పందించలేదు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading