Home » చనిపోయాడనుకున్న వ్యక్తి ఫోన్ చేశాడు.. ఆశ్చర్యపోయిన బంధువులు, పోలీసులు..!

చనిపోయాడనుకున్న వ్యక్తి ఫోన్ చేశాడు.. ఆశ్చర్యపోయిన బంధువులు, పోలీసులు..!

by Anji
Ad

చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే నేను బతికే ఉన్నాను.. నన్ను ఎవరో కొట్టి పారేశారంటూ చనిపోయాడునుకున్న వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. అంతే ఒక్కసారిగా బంధువులంతా ఉలిక్కిపడ్డారు. సినిమా స్టోరీ  ని తలపించే ఈ మిస్టరీ మర్డర్‌ సీన్‌ తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో చోటు చేసుకుంది.

Advertisement

అసలేం జరిగిందంటే… తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంకు చెందిన ధాన్యం వ్యాపారి కేతమల్ల పూసయ్య  ఎప్పటిలాగానే శుక్రవారం ఉదయం కూడా తన పొలం వద్దకు వెళ్లాడు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న ట్రాన్మ్‌ఫార్మర్‌ వద్ద మంటలు రావడం చుట్టు పక్కల పొలాలు వారు గమనించారు. వారు అక్కడికి చేరుకునే సమయానికి ట్రాన్స్‌ ఫార్మర్‌ వద్ద ఓ వ్యక్తి తగలబడిపోతూ కనిపించాడు. దీంతో వారు ఆ వ్యక్తి పూసయ్యే అని నిర్థారించుకుని పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు అందించారు.

Advertisement

 

దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈలోపు పూసయ్య కుటుంబంలోని ఓ వ్యక్తికి గుర్తు తెలియని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. అతను ఫోన్‌ ఎత్తి మాట్లాడగా అవతల వ్యక్తి నేను పూసయ్యను అంటూ తెలిపాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారంతా కూడా ఖంగుతిన్నారు. అసలు మాట్లాడుతుంది పూసయ్య కాదా అనే విషయాన్ని నిర్థారించుకోగా అతను పూసయ్యే అని తెలిసింది. దాంతో వారంతా అతనిని తీసుకుని రావడానికి వెళ్లారు. ఇంటికి చేరుకున్న పూసయ్య జరిగిన విషయాన్ని అక్కడ ఉన్నవారందరికీ తెలియజేశాడు.

అసలు ఏం జరిగిందంటే..?  పూసయ్య తన పొలం వద్దకు వెళ్లే సరికి ఎవరో ముగ్గురు వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఏదో పని చేస్తూ కనిపించారు. దీంతో పూసయ్య వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు తనను కొట్టి ఆటోలో రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి వద్ద పొలాల్లో పడేశారని తెలిపాడు. తీవ్రగాయాలతో బాధపడుతున్న తనకి ఓ వ్యక్తి సాయం చేసి తన ఇంటికి ఫోన్‌ చేసేందుకు ఫోన్‌ ఇచ్చినట్లు వివరించాడు. దీంతో పూసయ్య బతికే ఉన్నందుకు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Visitors Are Also Reading