Home » అమెరికాలో కొత్త వైరస్ కలకలం.. దీని లక్షణాలు ఇవే..!

అమెరికాలో కొత్త వైరస్ కలకలం.. దీని లక్షణాలు ఇవే..!

by Anji
Ad

అమెరికాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనిని హ్యుమన్ మెటా న్యూమో వైరస్ అని పిలుస్తున్నారు. వాస్తవానికి ఇది కొత్త వైరస్ ఏమి కాదు. దీని గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. ఈ వైరస్ 2001లో మొదటిసారి వెలుగులోకి వచ్చింది. 2018లో తీవ్రంగా వచ్చింది. దీని లాన్సెట్ గ్లోబల్ హెల్త్.. 2020లో ఓ నివేదికను ప్రచురించింది. 2018లో 1.40 లక్షల మందికీ పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో 6లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఐదేళ్లలోపు 16వేల మంది మరణించారు. 

Advertisement

ఈ వైరస్ ప్రధానంగా శ్వాస వ్యవస్థు దెబ్బతీస్తుంది. పెద్దవారిలో ఈవైరస్ లక్షణాలు అంతగా కనిపించవు. కానీ ముసలివారు, ఆస్తమాతో బాధపడేవారు, ఐదేళ్ల లపు పిల్లలు పసికందులపై ఇది ప్రభావం చూపిస్తుందని అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ ఫెక్షియస్ డిజీజెస్ తెలిపింది. ఈ వైరస్ జీవితాంతం మళ్లీ మళ్లీ సోకుతూనే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వైరస్ కి విరుగుడుగా కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసాయి. కరోనాకి వ్యాక్సిన్ తయారు చేసిన మోడోర్నా కంపెనీ.. HMPV కి కూడా వ్యాక్సిన్ తయారు చేసి మొదటి ట్రయల్ పూర్తి చేసినట్టు తెలిసింది. HMPV సోకిన వారిలో ముసలివారు పిల్లలే ఎక్కువగా ఉన్నారు. చాలా మందికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మార్చిలో కేసులు బాగా పెరిగిన సమయంలో జరిపిన టెస్టుల్లో 11 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. అమెరికాలో జనరల్ గా వ్యాధులకు వచ్చే పాజిటివ్ రేటు కంటే ఇది 36 శాతం ఎక్కువ అంటున్నారు. 

Advertisement

లక్షణాలు :

ఈ వైరస్ సోకిన వారిలో చాలా మందికి జలుబు వస్తోంది. దాదాపు వారం రోజుల పాటు ఉంటుంది. చాలా మంది దీంతో స్వయంగా రికవరీ అవుతుంటారు. ఇమ్యూనిటి తక్కువగా ఉన్న వారికే సమస్య వస్తుంది. దగ్గు, జ్వరం ఉంటుంది. ముక్కు రంద్రాలు మూసుకుపోతున్నాయి. శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికీ వ్యాపిస్తోంది. పరిశుభ్రతనే ఈ వైరస్ నుంచి కాపాడుతుంది. కరోనాకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలే దీనికి తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదంటున్నారు వైద్యులు.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మే నెల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఇదే… ఆ నాలుగు సినిమాల హిట్..!

ఆ మూవీలను రీ రిలీజ్ చేయమని అడుగుతున్నారు… కానీ నాకు… తేజ..!

Visitors Are Also Reading