సాధారణంగా చాలా మంది యువత ప్రేమించుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే తమ ప్రేమను గెలిపించుకుంటారు. కొంత మంది కన్నవారిని కాదనలేక తన ప్రేమను చంపుకుంటారు. మరికొందరూ ఇట్లో వారిని ఎదిరించి వివాహం చేసుకుంటారు. ఆ తరువాత తిరిగి ఇంటికి వచ్చేస్తుంటారు. కొందరూ తాము ప్రేమించిన వారి కోసం ఎంతటి త్యాగం చేయడానికైనా వెనకాడరు. చివరి వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ తమ ప్రేమను గెలిపించుకుంటారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
కేరళలో ఎనిమిదేళ్ల కిందట జరిగిన ఓ లవ్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. వెంజరమూడుకు చెందిన అనిష్, రజిత ఏడేండ్ల కిందటే ప్రేమించుకున్నారు. ఆ సమయంలో వారి ప్రేమను ఇంట్లో వారు ఒప్పుకోలేదు. రజిత ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వెళ్లి పోయింది. వీరిద్దరూ డిసెంబర్ 29, 2014న పెళ్లి చేసుకున్నారు. రజిత ఎంకామ్ చదువుతుండగా.. అనిష్ ఓ ప్రైవేట్ సంస్థలో పని చేసేవాడు. అనిష్ ఉద్యోగం చేస్తూనే తన భార్య చదువు కోసం ఆసరాగా నిలబడ్డాడు. కామర్స్‌లో ఆమె పీహెచ్‌డీ పూర్తి చేసి గెస్ట్ లెక్చరర్‌గా పని చేస్తోంది. రజిత ఏ పెళ్లి వేడుకకు వెళ్లినా మూడీగా ఉండేది. పెళ్లి విషయంలో మాత్రం అసంతృప్తిగా ఉండేది. తమ పెళ్లి పెద్దల ఆశీర్వాదం లేకుండా ఎలాంటి ఎంజాయ్ లేకుండా జరిగిందని బాధపడుతుండేది. ఈ విషయాన్ని ఆమె భర్త గమనించాడు.
Advertisement
ఈ దంపతులకు ఓ పాప జన్మించింది. ఆమెకు ప్రస్తుతం ఏడేళ్లు. తన భార్య పడుతున్న వేదనను ఏవిధంగనైనా దూరం చేయాలనుకున్నాడు అనిష్. ఇక ఇంతలోనే అతని పెళ్లిరోజు వచ్చేసింది. సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. బంధువులు, స్నేహితులందరికీ ఆహ్వానించాడు. పెళ్లి వేడుక ప్లాన్ చేశారు.అందరి సమక్షంలో వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేశారు. తిరువనంతపురంలోని అట్టకల్ దేవాలయం శంకుముఖం బీచ్‌తో సహా వివిధ ప్రదేశాల్లో సేవ్ ది డేట్, ఫ్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ నిర్వహించారు. వీరి ఫోటోలు ఆ జంట ఎప్పటికీ గుర్తుండేలా ఆల్బమ్ తయారైంది. ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక అనిష్ తన భార్యకు ఇచ్చిన సర్‌ప్రైజ్ విషయాన్ని తెలుసుకున్న నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అనిష్ దివ్యాంగుల పిల్లలకు సాయం చేసేందుకు స్నేహ యాత్ర స్వచ్ఛంద సంస్థను వలియా కొట్టాల్‌లో నిర్వహిస్తున్నారు. ఎంతో మంది పేదలకు పలు సందర్భాల్లో సహాయం కూడా చేస్తున్నాడు.
అందరి మధ్యలో వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేశారు. తిరువనంతపురం లోని అట్టుకల్ దేవాలయం, శంఖుముఖం బీచ్ తో సహా వివిధ ప్రదేశాలలో సేవ్ ది డేట్, ఫ్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ (Wedding phot shoot) కార్యక్రమం నిర్వహించారు. వీరి ఫోటోలు ఆ జంట ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఆల్బమ్ తయారయింది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోలు ట్రెండింగ్ మారాయి. అనీష్ తన భార్యకు ఇచ్చిన సర్ ప్రైజ్ కానుకకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అనీష్ తన భార్య కోసం.. అందమైన కవిత కూడా రాశాడు. అదే విధంగా.. అనీష్ పదిహేనేళ్లలోపు దివ్యాంగులైన పిల్లలకు సహాయం కోసం స్నేహ యాత్ర అనే స్వచ్ఛంద సంస్థను వలియాకొట్టక్కల్ లో నిర్వహిస్తున్నారు. ఈ బృందం వరదల సమయంలో, అన్నార్థులకు, అవసరమైన వారికి అవసరమైన వారికి సహాయం అందిస్తుంది. అంతేకాకుండా రక్తదాన శిబిరాలను కూడా అనీష్ తమ మిత్రులతో కలసి నిర్వహిస్తుంటారు.
Also Read :
Brahmastra Movie: బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర పేరిట సోషల్ మీడియాలో ట్రెండింగ్.. ఎందుకంటే..?
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ గుర్తుందా…? ఇప్పుడు ఎక్కడ ఉంది..ఏం చేస్తుందంటే..!