Home » పుట్టిన 72 రోజులకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు.. అదేలా సాధ్యమంటే..?

పుట్టిన 72 రోజులకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు.. అదేలా సాధ్యమంటే..?

by Anji
Ad

సాధారణంగా ఎవ్వరైనా ప్రపంచ రికార్డులను సాధించాలంటే మాత్రం నానా తంటాలు పడుతుంటారు. కొందరూ తమకు తెలియకుండానే ప్రపంచ రికార్డులను క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు.  ఇప్పుడు ఈ చిన్నారి కూడా అలాగే రికార్డు  సృష్టించింది. కేవలం 72 రోజుల వయస్సులో ఈ చిన్నారి పేరిట ఏకంగా 33 ప్రభుత్వ ధృవ పత్రాలు రావడంతో ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ చిన్నారికి అదేలా సాధ్యమైందనుకుంటున్నారా.? అయితే మీరు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. 

Advertisement

మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడా జిల్లాకు చెందిన కేసరినందన్ సూర్యవంశీ, ప్రియాంక దంపతులకు ఈ ఏడాది జూలై 8వ తేదీన చిన్నారి శరణ్య జన్మించింది. పుట్టి మూడు నెలల లోపు చిన్నారి శరణ్య ఏకంగా ప్రపంచ రికార్డులరె  సాధించేసింది. ఎలా అంటే.. తమ పాప పుట్టుక ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్న ఈ దంపతులు గతంలో 28 గుర్తింపు పత్రాలతో ఓ చిన్నారి పేరిట ప్రపంచ రికార్డు ఉందనే విషయం తెలుసుకున్నారు. దీంతో తామూ తమ కూతురు పేరును ప్రపంచ రికార్డుల్లో చేర్చాలనుకున్నారు. వెంటనే దంపతులిద్దరూ పోటీకి దిగారు. అందుకు వీలైనన్ని ఎక్కువ డాక్యుమెంట్లు తమ కూమార్తె పేరు మీద తీసుకురావాలనుకున్నారు. అలా తమ కుమార్తె శరణ్య పుట్టిన 72 రోజుల్లోనే 31 రకాల ధ్రువపత్రాలు సాధించి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించగలిగారు. శరణ్య తల్లిదండ్రులు కేసరి నందన్‌, ప్రియాంక ఇద్దరూ చందన్‌గావ్‌లోని తపాలాశాఖలో ఉద్యోగులు.

Advertisement

అంతేకాదు.. శరణ్య తాతయ్య కూడా పోస్టల్‌ ఉద్యోగే. శరణ్య పేరుతో 72 రోజుల్లో 31 గుర్తింపు పత్రాలు సంపాదించి లక్ష్యాన్ని సాధించారు. పాస్‌పోర్ట్‌, ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్, ఇమ్యునైజేషన్ కార్డ్, ‘లాడ్లీ లక్ష్మి’ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, స్థానిక నివాస ధృవీకరణ పత్రం, జాతీయ ఆరోగ్య కార్డ్, ‘సుకన్య సమృద్ధి’ ఖాతా, ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ పత్ర’, ‘రాష్ట్రీయ పొదుపు పత్రాలు’, ‘కిసాన్ వికాస్ పత్ర’, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా, పీఎన్‌బీ ఎటీఎమ్‌ కార్డ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా, బ్యాంకు ఖాతాలు.. ఇలా పలురకాల పత్రాలు ఇందులో ఉన్నాయి. కాగా సరైన గుర్తింపు పత్రాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అనేక ప్రభుత్వ పథకాలకు వారు దూరం అవుతుంటారు. అటువంటి వారిలో అవగాహన కల్పించేందుకే ఇలా చేశామని తెలిపారు. అంతేకాదు కూతురు పుట్టినప్పుడు ఏయే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయో, వాటిని ఎలా పొందాలో వంటి వివరాలు ఎలా పొందాలో తెలియజేయాలనుకున్నాం. సంబంధిత వివరాలతో సకాలంలో దరఖాస్తు చేస్తే ఎలాంటి ధృవీకరణ పత్రం అయినా సులువుగా అందుకోవచ్చని తెలిపారు.

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

World Cup 2023 : వరల్డ్ కప్ నుంచి గిల్ అవుట్..ధావన్ కు పిలుపు ?

 ఇండియాను రెచ్చెగొట్టేలా రిజ్వాన్ ప్రవర్తన..!

 

Visitors Are Also Reading