హాలీవుడ్ లో మంచి పేరు ఉన్న దిగ్గజ దర్శకులలో క్రిస్టోఫర్ నోలన్ ఒకడు. పట్టుమని పడే పది సినిమాలు తీసిన ఈ ఫిలిం మేకర్, తనదైన ఫిలిం మేకింగ్ టెక్నిక్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఇండియాలోచూస్తే మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో ఈ దర్శకుడు సినిమాలకు మహా క్రేజ్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈయన అసలు క్రిస్టోఫర్ నోలన్ అయినప్పటికీ తెలుగు యువత మాత్రం నోలన్ మావా అంటూ ప్రేమగా పిలుచుకుంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు.
Advertisement
2020 ఈయన దర్శకత్వంలో తెరకెక్కించిన టెనెట్ సినిమా తెలుగులో మంచి బుకింగ్స్ ని రాబట్టగా లేటెస్ట్ గా నోలన్ దర్శకత్వంలో రాబోతున్న ఒప్పేన్హిమెర్ సినిమా కూడా ఇండియాలో మరియు తెలుగు రాష్ట్రాలలో మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. జులై 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నఈ మూవీలో న్యూక్లియర్ వెపన్ పై నడిచే కథగా ఈ సినిమా ఉండబోతుంది.
Advertisement
ఇటీవలే ఈ చిత్రం ఇండియాలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ఇండియన్ సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ను ఇచ్చింది. న్యూDటి ఎక్కువగా ఉండటం వల్ల ఈ సర్టిఫికెట్ జారీ చేసినట్టు సెన్సార్ టీమ్ తెలిపింది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. నోలన్ సినిమాలో న్యూడిటి ఉండటమే. దాదాపు ఆయన సినిమాలన్ని స్క్రీన్ ప్లే బేస్డ్ పై ఉండగా.. ఈ చిత్రం న్యూDటి ఎక్కువగా ఉంది ఏ సర్టిఫికేట్ రావడంతో ఒక్కసారిగా ఈ సినిమా పై అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో సోషల్ మీడియాలో అందరూ ఏం ప్లాన్ చేశావ్ నోలన్ మావా అంటూ మిమ్స్ కూడా వేస్తున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
నిహారిక గురించి వేణు స్వామి ఏం చెప్పారో తెలుసా ?
రాజమౌళి లాగా ప్లాప్ లేకుండా సినిమాలు చేసిన దర్శకులు !