Home » ప్లేయింగ్ కార్డులతో ప్రపంచ రికార్డు సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు..!

ప్లేయింగ్ కార్డులతో ప్రపంచ రికార్డు సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు..!

by Anji
Ad

గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. వారిలో గెలిచిన వారు కొంతమంది అయితే.. విఫలం అయినవాళ్లు చాలామంది ఉంటారు. అలా భారత దేశానికి చెందిన ఎంతో మంది గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించారు. చిన్న వయసు నుంచి పెద్ద వాళ్ల దాకా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇండియాకి చెందిన 15 ఏళ్ల కుర్రాడు కూడా గిన్నీస్ రికార్డు సాధించాడు. అది కూడా ప్లేయింగ్ కార్డ్స్ తో. చాలామందికి ప్లేయింగ్ కార్డ్స్ గురించి తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఖాళీగా ఉన్నప్పుడు కొంతమంది సరదాగా ఆడుతుంటారు. కానీ కొంత మంది మాత్రం జూదంగా ఆడుతుంటారు.

Advertisement

అయితే మనం చిన్నప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ తో చిన్నగా బిల్డింగ్స్ కడుతూ ఉంటాం. ఇలా ఎంతోమంది ఆడే ఉంటారు. ఇంట్లో ప్లేయింగ్ కార్డ్స్ ఉంటే వాటిని సరదాగా బిల్డింగులు కడుతూ ఆనందించే వారు. జస్ట్ కొంచెం గాలి వేసినా, ఒక వేలు ఆనించినా మొత్తం పడిపోయేది. ఎందుకంటే అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇప్పుడు అలాంటి వాటిని ఉపయోగించి ఈ కుర్రాడు గిన్నీస్ రికార్డు సాధించాడు. ఇంతకీ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

భారతదేశంలోని కోల్ కతాకు చెందిన అర్నవ్ అనే 15 ఏళ్ల కుర్రాడు గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించాడు. కోల్ కతాకు చెందిన నాలుగు రకాల భవన నిర్మాణాలను ప్లేయింగ్ కార్డ్స్ తో తయారు చేశాడు నిర్మాణాలను తయారు చేసి మొత్తాన్ని వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. అర్నవ్ రూపొందించి భవనాలు 11 అడుగుల పొడవు, 4 అంగుళా ఎత్తు, 16 అడుగులు, 8 అంగుళాల వెడల్పుతో అతి పెద్ద ప్లేయింగ్ కార్డ్ స్ట్రక్చర్ గా రూపొందించి ప్రపంచ రికార్డును సాధించాడు. బైగాన్ బెర్గ్ సృష్టించిన రికార్డును బద్దలు కొట్టాడు. రైటర్స్ బిల్డింగ్, షహీద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్స్ కేథడ్రల్ వంటి ప్రతి రూపాలను నిర్మించడానికి అర్నవ్ 1,43,000 కార్డులను ఉపయోగించాడు.

అనంతరం బాలుడు అర్నవ్ మాట్లాడుతూ.. వరల్డ్ రికార్డు సాధించినందుకు చాలా ఆనందంగా అనిపించింది. నా తల్లిదండ్రులు కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. కోల్ కతాకు చెందిన నాలుగు ప్రతిరూపాలను ఎంచుకొని చేశాను. మధ్యలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ, నేను నిరాశ పడకుండా మళ్ళీ చేశానని అర్నవ్ చెప్పాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నారు. ఆ బాలుడిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.

Visitors Are Also Reading