ఒక రాజు దగ్గర 10 అడవి కుక్కలుండేవి. తన సైనికుల్లో ఎవరైనా తప్పు చేస్తే వాటిని వారి మీదకు వదిలేవాడు. ఈ తంతు ఇలా జరుగుతున్న క్రమంలో ఒక సైనికుడి మీద తప్పుడు అభియోగం మోపబడుతుంది. అది అర్థం చేసుకోని రాజు అతడి మీద కూడా కుక్కలను వదిలే శిక్ష వేస్తాడు. ఆ సైనికుడు ఎంతలా చెబుతున్నా రాజు వినిపించుకోలేదు. నీ చివరి కోరికేంటో చెప్పు అన్నాడు. దానికి ఆ సైనికుడు నన్ను చంపే ముందు 10 రోజుల పాటు ఆ కుక్కలతో గడుపుతాను అన్నాడు దానికి రాజు సరేనన్నాడు.
Advertisement
Advertisement
ప్రతిరోజు కుక్కులకు తిండిపెట్టడం, వాటికి స్నానం చేయించడం, వాటిని దువ్వడం, తనతో పాటు వాటిని వాకింగ్ కు తీసుకెళ్లడం లాంటి పనులు చేశాడు ఆ సైనికుడు ఇలా పదిరోజులు గడిచాయి. శిక్షించే టైమ్ వచ్చింది. సైనికుడిని మధ్యలో కూర్చోబెట్టి అతడి మీదకు ఈ కుక్కలను వదిలారు. కుక్కలు వేగంగా పరిగెత్తుకుంటూ పోయి ఆ సైనికుడి కాళ్లు నాకడం ప్రారంభించాయి. ఇది చూసిన రాజు ఆశ్చర్యపోయి ఏంటిది అని ప్రశ్నించాడు.
దానికి ఆ సైనికుడు బదులిస్తూ 10 రోజులు సేవ చేసినందుకే ఆ కుక్కలు ఇంతలా విశ్వాసం చూపాయి. 10 సంవత్సరాలు మీకు ఊడిగం చేసినా మీరు కనీసం నా మాటను కూడా వినలేదు. అది మీకు, ఈ కుక్కకు ఉన్న తేడా అని చెప్పాడు. దీంతో ఆ రాజు కళ్లు తెరుచుకున్నాయి. అప్పటి నుండి తన సైనికులను నమ్మడం మొదలుపెట్టాడు.