Home » చిరంజీవి-సురేఖ పెళ్లి ఆపేందుకు ఆ స్టార్ హీరో ప్రయత్నించాడా ?

చిరంజీవి-సురేఖ పెళ్లి ఆపేందుకు ఆ స్టార్ హీరో ప్రయత్నించాడా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగారు.  ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని.. స్వయం కృషి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడిగా పరిచయం అయిన తొలిసారిగా కెమెరా ముందు నటించిన సినిమా పునాది రాళ్లు. 

Advertisement

1978లో పునాదిరాళ్లు సినిమాలో చిరంజీవి నట జీవితం ప్రారంభం అయింది. చిరంజీవి నటుడుగా ఎదుగుతున్న సమయంలోనే సినిమాల్లో అడుగుపెట్టిన రెండేళ్లకే టాలీవుడ్ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో పెళ్లి జరిగింది. సురేఖ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈమె చిరంజీవి కన్నా ముందే అప్పట్లో స్టార్ హీరోగా పేరు నిలదొక్కుకున్నఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవాలనుకున్నారట.

Advertisement

ఆ హీరో నటన, వ్యక్తిత్వం పరంగానైనా సురేఖ తండ్రి అల్లు రామలింగయ్యకి చాలా ఇష్టమట. దీంతో ఆస్తులు కూడా బాగానే ఉండటంతో ఆయన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నారట. పెళ్లి చేద్దామనుకునే సమయంలోనే సురేఖ అలాగే ఆ హీరో జాతకాలు ఇద్దరివి ఒకసారి తమకు నమ్మకంగా ఉండే ఓ జ్యోతిష్యుడికి చూపించారట. వీరి జాతకాలను పరిశీలించిన తరువాత ఆ జ్యోతిష్యుడు జాతకాలు కలవలేదని.. పెళ్లి చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పడంతో అల్లు రామలింగయ్య తన కూతురుని ఆ హీరోకి ఇచ్చి పెళ్లి చేయడం మానుకున్నారట. ఇక ఆ తరువాత చిరంజీవితో సురేఖ పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రజినీకాంత్, షారుఖ్ ఖాన్ మల్టీ స్టారర్ సినిమా.. దర్శక ధీరుడు ప్లాన్ చేస్తున్నారా…?

తల్లికి ఇచ్చిన ఆ మాటని.. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు దాటడు.. ఇప్పటికి కూడా..!

Visitors Are Also Reading