Home » రజినీకాంత్, షారుఖ్ ఖాన్ మల్టీ స్టారర్ సినిమా.. దర్శక ధీరుడు ప్లాన్ చేస్తున్నారా…?

రజినీకాంత్, షారుఖ్ ఖాన్ మల్టీ స్టారర్ సినిమా.. దర్శక ధీరుడు ప్లాన్ చేస్తున్నారా…?

by Sravya
Ad

రజినీకాంత్ జైలర్ సినిమాతో మంచి హిట్ ని కొట్టేశారు. షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. అయితే వీళ్ళిద్దరూ కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమాని దర్శక ధీరుడు రాజమౌళి తీసుకువస్తారని టాక్ నడుస్తోంది. మరి నిజంగా రాజమౌళి వీళ్లిద్దరితో సినిమా ని ప్లాన్ చేస్తున్నారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యి 1000 కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసింది.

rajamouli 1

Advertisement

Advertisement

జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి ప్రతి ఒక్క హీరో కూడా రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటూ ఉంటారు. బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన షారుక్ ఖాన్ రజనీకాంత్ రాజమౌళి సినిమా చేస్తే కలెక్షన్లు బాగా వస్తాయి అని అంటున్నారు. ఇద్దరు హీరోలు కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది..? అతి త్వరలోనే ఈ సినిమా కోసం శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది త్వరలోనే వివరాలు బయటకి రాబోతున్నాయి. మహేష్ బాబుతో ప్రస్తుతం రాజమౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే మరి రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేస్తారా లేదా ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.

Also read:

Visitors Are Also Reading