బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన జవాన్ మూవీ సెప్టెంబర్ 07న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. షారూఖ్ గత సినిమా పఠాన్ రూ.1000 కోట్లను కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.
Advertisement
మరోవైపు తమిళ దర్శకుడు అట్లీ, అనిరుధ్ మ్యూజిక్ దర్శకుడు కావడంతో సినిమాకు నార్త్ తో పాటు సౌత్ లో కూడా మంచి క్రేజ్ పెరిగింది. ఈ మూవీ కోసం ఆడియెన్స్ తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. అది ఏంటి జవాన్ సినిమాతో అల్లు అర్జున్ కి లింక్ ఏంటి అని అనుకుంటున్నారా..? ఇందుకు ఓ కారణం ఉందండోయ్.. అది ఏంటంటే.. దర్శకుడు అట్లీ టాలీవుడ్ హీరోలతో సినిమా చేయాలని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాడట. ఆ మధ్య ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపించాయి.
Advertisement
కానీ ఆ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు అట్లీ ప్రయత్నిస్తున్నాడని టాక్. ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జవాన్ విడుదలయ్యాక ఫలితాన్ని బట్టి అట్లీతో సినిమా చేయాలా ? వద్దా అనేది డిసైడ్ చేస్తాడట. అన్ని కుదిరితే త్రివిక్రమ్ సినిమా తరువాత అట్లీతో అల్లుఅర్జున్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎలాగో జవాన్ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్న తరుణంలో ఈ వార్త అభిమానులకు కిక్ ఇస్తోంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
బిగ్ బాస్ 7 సీజన్ లో చివరి నిమిషంలో తప్పుకున్న స్టార్స్ వీరే..!