Home » ఆదిపురుష్,బ్రో మొదలు ఎక్కువ నష్టాలని.. తెచ్చిన సినిమాలు ఇవే..!

ఆదిపురుష్,బ్రో మొదలు ఎక్కువ నష్టాలని.. తెచ్చిన సినిమాలు ఇవే..!

by Sravya
Ad

అన్ని సినిమాలు కూడా సక్సెస్ అవుతాయని చెప్పలేము. రిలీజ్ అయ్యే వరకు కూడా దర్శకులు సినిమా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని,సినిమాలోని రిలీజ్ చేస్తూ ఉంటారు కానీ ఒక్కోసారి అవి డిజాస్టర్స్ గా మిగిలిపోయే అవకాశం ఉంది. అత్యధిక నష్టాలని తీసుకువచ్చిన సినిమాలు గురించి ఇప్పుడు చూద్దాం. సమంత శకుంతలం, అఖిల్ ఏజెంట్ సినిమాలు పెద్ద డిజాస్టర్స్ గా రికార్డ్ కి ఎక్కాయి. ఆది పురుష, బ్రో సినిమాలు కూడా డిజాస్టర్స్ గానే మిగిలిపోయాయి. ప్రభాస్ హీరోగా వచ్చిన రాధే శ్యామ్ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. 84 కోట్ల రూపాయల నష్టం ఈ సినిమాకి కలిగింది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఈ సినిమాకి ఏకంగా 66 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది.

Advertisement

ఈ సినిమా 61 కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. మొత్తం 60 కోట్ల నష్టం కలిగింది ఈ సినిమాకి. ఎన్టీఆర్ కథానాయకుడు, ప్రభాస్ సాహో, ఎన్టీఆర్ మహానాయకుడు, సైరా నరసింహారెడ్డి, నేనొక్కడినే, బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గానే నిలిచిపోయాయి. అఖిల్ ఏజెంట్, కొమరం పులి, వినయ విధేయ రామ, ఆరెంజ్, తుఫాన్, బ్రూస్ లీ, కాటమరాయుడు, ఓం నమో వెంకటేశాయ, ఇంటిలిజెంట్, శక్తి, పరమవీరచక్ర, ఆగడు, షాడో, రామయ్య వస్తావయ్య సినిమాలు కూడా డిజాస్టర్స్ గానే నిలిచిపోయాయి. ఈ సినిమాలకి కూడా భారీగా లాస్ వచ్చింది.

Also read:

Visitors Are Also Reading