Home » బాలకృష్ణ డేట్స్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ ఎదురుచూస్తున్నాడా ? 

బాలకృష్ణ డేట్స్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ ఎదురుచూస్తున్నాడా ? 

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన స్టార్ దర్శకుడు బి.గోపాల్ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరనే విషయం చెప్పాలి. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పలు సూపర్ సినిమాలు తీసి వాళ్ల కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలను అందించిన దర్శకుడు బి.గోపాల్ ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ దర్శకుల హవా కొనసాగుతుండటంతో బి.గోపాల్ వంటి సీనియర్ డైరెక్టర్ కనుమరుగు అయిపోయారు.

Advertisement

 

హీరోలు కూడా సీనియర్ డైరెక్టర్ల కంటే కొత్త దర్శకులతోనే సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో ఓల్డ్ డైరెక్టర్లు అందరూ డైరెక్షన్ కి దూరమైపోయారు. అప్పుడప్పుడు ఎస్వీకృష్ణారెడ్డి వంటి దర్శకులు సినిమాలు చేస్తున్నా కూడా ఆ సినిమాలు ప్రేక్షకాదరణ పొందడం లేదు.  తాజాగా దర్శకుడు బి.గోపాల్ కూడా మరోసారి దర్శకుడు చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడట. ఆయన చివరి సినిమా ఆరు అడుగుల బుల్లెట్.. గోపిచంద్ హీరోగా నటించిన ఈ ఆరడుగుల బుల్లెట్ సినిమా పలు కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. దాదాపు నాలుగేళ్ల తరువాత ఈ చిత్రం 2021లో థియేటర్స్ రిలీజై.. డిజాస్టర్ గా నిలిచింది. బి.గోపాల్ అవుట్ డేటెడ్ దర్శకులు లిస్ట్ లో చెేరిపోయాడు. 

Advertisement

ప్రస్తుతం దర్శకుడు బి.గోపాల్ బాలయ్యతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పలనాటి బ్రహ్మనాయుడు వంటి సినిమాలు వచ్చాయి. బాలయ్యతో చివరగా ఓ సినిమా చేసి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా రిటైర్ అయిపోదామనే ఆలోచనలో ఉన్నాడట. కానీ బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. బి.గోపాల్ సినిమాను ఇప్పట్లో ఓకే చేసే పరిస్థితి కనిపించడం లేదు. దర్శకుడు బి.గోపాల్ మాత్రం బాలయ్య సినిమా చేయాల్సిందేనని ఫిక్స్ అయిపోయారట. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందో లేదో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

చివరి రోజుల్లో శోభన్ బాబుకి వింత వ్యాధి.. మరణించడానికి ముందు ఏం జరిగిందో తెలుసా ?

 వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ మూవీ నుంచి సర్ ప్రైజ్ అప్డేట్..!

 

Visitors Are Also Reading