మెగాస్టార్ చిరంజీవి నేడు సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మెగాస్టార్ మీడియాతో మాట్లాడుతూ….సీఎం జగన్ సినిమా టికెట్ల అశంపై చర్చించేందుకు తనను ఆహ్వానించడం ఆనందంగా ఉందని అన్నారు. పండుగ రోజు ఇంటికి ఆహ్వానించి స్వయంగా నా సోదరుడు మరియు భారతి భోజనం పెట్టారని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం తనపై పెట్టిన నమ్మకం తనకు ఎంతో బాధ్యతగా అనిపించిందని చెప్పారు.
Advertisement
థియేటర్ల బాధలు, ఎగ్జిబిటర్ల బాధలు నటీనటుల బాధలు అన్నీ వివరించానని తెలిపారు. సినీ పరిశ్రమ భయటకు కనిపించేంత కలర్ ఫుల్ కాదని అన్నారు. దాని వెనకాల ఎంతోమంది కార్మికులు ఉన్నారని చెప్పారు. అత్యధికులు వారే ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ కు నిర్మాణాత్మక సూచనలను వివరించానని చెప్పారు. సీఎం తో చర్చించిన విషయాలన్నింటిని ఇండస్ట్రీలోని పలువురితో చర్చిస్తానని చెప్పారు.
Advertisement
సీఎం జగన్ మరోసారి సమావేశం అవుదాని చెప్పారని కాబట్టి ఇండస్ట్రీలోని పలువురితో చర్చించి ఆ తరవాత మళ్లీ సీఎంను కలుస్తామని చెప్పారు. మరోసారి సమావేశానికి కూడా సింగిల్ గా రమ్మంటే ఒక్కడినే వెళతానని…వందమందితో రమ్మంటే వంద మందితో వెళతానని చెప్పారు. తాను రెండు విషయాలపై ఆలోచిస్తానని నేను చెప్పిన అంశాలను కమిటీతో వివరించి నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ఇండస్ట్రీలోని ప్రతి సమస్యను సీఎం ముందు ఉంచానని వాటిని ఆయన కమిటిలో పెడతారని చెప్పారు. ఇండస్ట్రీ లో ఎవరు దయచేసి ప్రభుత్వం పై కామెంట్ లు చెయ్యొద్దని ఒక వారం పది రోజుల్లో మనకి ఆమోద యోగ్యం అయిన జీవో వస్తుందని చిరంజీవి అన్నారు.
ALSO READ :జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం….నేనే వెళ్లమన్నా..నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు..!