Home » మెగాస్టార్ బోళాశంకర్ సెన్సార్ పూర్తి.. అదే హోప్..!

మెగాస్టార్ బోళాశంకర్ సెన్సార్ పూర్తి.. అదే హోప్..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ తరువాత  నటిస్తున్న తాజా చిత్రం బోళాశంకర్. ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. తమిళంలో హిట్ అయినా వేదాళం మూవీకి ఇది రీమేక్ గా రూపొందించారు. ఈ మూవీ మెగా అభిమానుల్లో ప్రారంభం నుంచి పెద్దగా ఆసక్తి మాత్రం కనిపించడం లేదు. ఈ మూవీ రీమేక్ కావడం ఒక కారణమైతే.. మెహర్ రమేష్ దర్శకత్వం వహించడం మరో కారణం అని చెప్పవచ్చు.

Advertisement

చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లెలు క్యారెక్టర్ లో నటిస్తోంది. సుశాంత్ కీర్తికి జోడిగా నటించాడు. అయితే ఈ చిత్రం ట్రైలర్, టీజర్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. జామ్ జామ్ జజ్జనక, మాలికి బ్యూటీ సాంగ్స్ కి మాత్రం మంచి రెస్పాన్స్ దక్కింది.  వీటికీ అంతో ఇంతో పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి చేసుకుంది. పెద్దగా కట్స్ ఏమి చెప్పని సెన్సార్ యూ/ఏ రేటింగ్ ఇచ్చింది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, సమపాళ్లలో ఉండేవిధంగా దర్శకుడు మెహర్ రమేష్ ప్లాన్ చేశాడని సమాచారం.

Advertisement

చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయడంపై ఓ వర్గం అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. మరో వర్గం అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. మెగాస్టార్ సీన్స్ ని మరొకరి సినిమాలో రిఫరెన్స్ గా వాడుకోవాలి కానీ.. ఇంకొకరినీ మెగాస్టార్ తో ఇమిటేట్ చేయించడం ఏమిటని దర్శకుడు మెహర్ రమేష్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో వచ్చిన రీమేక్ సినిమాలకు సక్సెస్ రేటు లేకపోవడంతో మెగా అభిమానులను ఈ మూవీ కాస్త టెన్షన్ పెడుతోంది. తమిళంలో అజిత్ నటించిన వేదాళం రేంజ్ లో కాకపోయినా బోళాశంకర్ డీసెంట్ హిట్ అయినా అవుతుందా అనేది వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఖుషి మూవీ గురించి ఆ హీరో ఆసక్తికర పోస్ట్.. అది చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

బాలి వెకేషన్ లో సమంతతో పాటు ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading