Home » నేను చేసిన సాయం గురించి విశ్వక్ సేన్ కి కూడా తెలియదు.. వైరల్ అవుతున్న సాయి రాజేష్ కామెంట్స్!

నేను చేసిన సాయం గురించి విశ్వక్ సేన్ కి కూడా తెలియదు.. వైరల్ అవుతున్న సాయి రాజేష్ కామెంట్స్!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

సొంతంగా ఇండస్ట్రీలో పైకి వచ్చిన హీరోలలో విశ్వక్ సేన్ ముందు ఉంటారు. కేవలం నటనలో మాత్రమే కాదు.. దర్శకత్వంలో కూడా ప్రతిభ చాటుకున్న ఘనుడు ఆయన. తాను నటించిన రెండు సినిమాలనూ ఆయనే డైరెక్ట్ చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ రేంజ్ లో హిట్ కాలేదు. కానీ, విశ్వక్ సేన్ లోని దర్శకుడు మాత్రం అందరికి నచ్చేసాడు. రీసెంట్ గా “దాస్ కా ధమ్కీ” తో వచ్చి ఇరగదీసాడు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ లో నటించారు.

Advertisement

అయితే.. సినిమాల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా విశ్వక్ ఆక్టివ్ గా ఉంటారు. ఏ విషయం పై అయినా ముక్కు సూటిగా స్పందిస్తుంటారు. బేబీ సినిమా డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలకు కూడా విశ్వక్ సేన్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇండైరెక్ట్గా వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదాలన్నీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. తాజాగా.. ఈ విషయంపై సాయి రాజేష్ మరో సారి సంచలన కామెంట్స్ చేసారు.

Advertisement

వ్యక్తిగతంగా విశ్వక్ సేన్ పై తనకి ఎటువంటి కోపం లేదా ద్వేషం లాంటివి లేవన్నారు. హృదయ కాలేయం డైరెక్టర్ అయితే.. కథ కూడా వినను అంటూ ఆయన చెప్పిన విధానం బాధకలిగించింది అని మాత్రం అన్నారు. నో చెప్పడం వల్ల బాధ లేదని, నో చెప్పిన విధానం వల్లే బాధ కలిగిందని చెప్పుకొచ్చారు. విశ్వక్ సేన్ మొదటి సినిమా వెళ్ళిపోమాకే ట్రైలర్ నాకు బాగా నచ్చిందని, కానీ అనుకోని ఇబ్బందుల వలన ఆ సినిమా ఆగిపోవడం గుర్తుందన్నారు. ఆ టైం లో విశ్వక్ కు సాయం చేసానని.. ఈ సినిమాను నేను అల్లు అరవింద్, దిల్ రాజు వద్దకు తీసుకెళ్లి.. బాగుంది, చూడమని సజెస్ట్ చేశానన్నారు. ఆ తరువాతే ఈ సినిమా విడుదల అయ్యిందన్నారు. ఈ విషయం ఇప్పటివరకు విశ్వక్ సేన్ కి కూడా తెలియదు అన్నారు. ఎవరికీ చెప్పలేదని, చెప్పాల్సిన అవసరం లేదనుకున్నానని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు.

 

ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?

మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్

ధోని కుట్ర చేశాడు.. కావాలనే రన్ అవుట్ అయ్యాడు – యువరాజ్ తండ్రి సంచలనం

Visitors Are Also Reading