Home » ఆ హిట్ దర్శకులతో జత కట్టేందుకు నాగచైతన్య సిద్ధమవుతున్నాడా..?

ఆ హిట్ దర్శకులతో జత కట్టేందుకు నాగచైతన్య సిద్ధమవుతున్నాడా..?

by Anji
Ad

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తన పంథాను మార్చినట్టు కనిపిస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలను చేస్తున్నాడు చైతన్య. ఇప్పుడు మాత్రం హిట్ మీద ఉన్న దర్శకులే కావాలంటున్నాడట. అసలు విషయం ఏంటంటే..  ఇటీవలే కస్టడి అనే బై లాంగ్వేజికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్యకి మరోసారి పరాజయం తప్పలేదు. తమిళస్టార్ దర్శకుడు అయిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై నాగచైతన్య చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే ఆయన అంచనాలన్ని కూడా తలకిందులయ్యాయి. 

Advertisement

హీరోయిన్ గా కృతిశెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటివరకు కెరీర్ లో సాలిడ్ హిట్ లేని చైతన్య ఇక పై రిస్క్ చేయదలచుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య, చందుమొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత నాగచైతన్య సామజవరగమన మూవీతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 

Advertisement

ఇటీవలే శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో నాగచైతన్య రామ్ అబ్బరాజు దర్శకత్వంలో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. త్వరలోనే ఈ చిత్రంపై కూడా క్లారిటీ రానున్నట్టు సమాచారం. వాస్తవానికి నాగచైతన్య నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడలతో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇటీవలే ఆయన దర్శకత్వంలో వచ్చిన ఉగ్రం మూవీ ఆశించినంత విజయం సాధించకపోవడంతో నాగచైతన్య విజయ్ కనకమేడల ప్రాజెక్ట్ ని వాయిదా వేసి రామ్ అబ్బరాజు ప్రాజెక్ట్ ని ఓకే చేయనున్నాడు. దీనిని బట్టి చూస్తే.. నాగచైతన్య ఇప్పటి నుంచి కెరీర్ విషయంతో జాగ్రత్తగా వహిస్తున్నాడనిపిస్తోంది. ప్రస్తుతం హిట్ లో ఉన్న దర్శకులతో జతకడుతున్న నాగచైతన్యకి ఈ దర్శకులు అయిన హిట్స్ ఇస్తారో లేదో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 హీరోయిన్ పై కామెంట్స్ చేసిన హీరో రాజశేఖర్… కట్ చేస్తే సినిమా నుంచి ఔట్…!

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ఎవరి కోసం నేర్చుకున్నారో తెలుసా..?

Visitors Are Also Reading