Home » Srileela: అల్లు అర్జున్ సినిమాకు “నో” చెప్పిన శ్రీలీల.. కారణం ఏంటంటే?

Srileela: అల్లు అర్జున్ సినిమాకు “నో” చెప్పిన శ్రీలీల.. కారణం ఏంటంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ల స్థాయికి చేరింది శ్రీలీలా. ఈమె ధమాకా సినిమా తర్వాత ఎదురులేని హీరోయిన్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాలు ఒప్పుకుంది. అయితే తాజాగా ఈ అమ్మడు అంతర్జాతీయ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈమె చెన్నై స్టోరీ అని ఇంగ్లీష్ సినిమాలో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది.

Advertisement

మరో ఏడాది వరకు ఆమె డేట్స్ దొరికే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఏడు సినిమాలు ఉన్నాయి. దాదాపు అందరు టాలీవుడ్ బడా హీరోల సరసన శ్రీలీల నటిస్తోంది. అయితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకి మాత్రం శ్రీ లీల నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ “పుష్ప” సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ ను రూపొందిస్తున్నారు.

Advertisement

పుష్ప 2 గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీలను స్పెషల్ సాంగ్ లో తీసుకోవాలని సుకుమార్ భావించారట. అయితే.. ఇందుకోసం శ్రీలీలను సంప్రదించగా ఆమె నో చెప్పారని సమాచారం. సోలో హీరోయిన్ గా దుమ్ము దులుపుతున్న శ్రీలీల స్పెషల్ సాంగ్స్ చేయాలని ప్రస్తుతం అనుకోవడం లేదట. మరో వైపు డేట్స్ కూడా లేకపోవడంతో నో చెప్పిందని అంటున్నారు. నిజానికి టాలీవుడ్ లో అల్లు అర్జున్ పక్కన ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూస్తుంటారు. అలాంటిది వచ్చిన అవకాశాన్ని శ్రీలీల రిజెక్ట్ చేయడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

మరిన్ని..

BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !

Visitors Are Also Reading