Home » జన్మలో కూడా వెంకటేష్ వంటి హీరోతో సినిమా చేయనంటున్న తేజ.. ఎందుకో తెలుసా ?

జన్మలో కూడా వెంకటేష్ వంటి హీరోతో సినిమా చేయనంటున్న తేజ.. ఎందుకో తెలుసా ?

by Anji
Ad

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలిచాడు వెంకటేష్. మామూలుగా సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా వెంకటేష్ సినిమాలకు అభిమానులు ప్రత్యేకంగా ఉంటారు. ముఖ్యంగా లేడీస్ అయితే అప్పట్లో వెంకటేష్ సినిమా వస్తుందంటే చాలు.. పనిని పక్కకు పెట్టి మరీ సినిమా వీక్షించేవారు. 

Advertisement

వెంకటేష్ ఒక్క జెనరేషన్ వెనక్కి వెళ్లితే ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. అందువల్ల ఆయన సినిమాలకు టాక్ బాగా లేకున్నప్పటికీ వసూళ్లకు మాత్రం ఢోకా ఉండదు. అంతెందుకు సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరిలో మినిమమ్ గ్యారెంట్ హీరోల లిస్ట్ లో వెంకటేష్ పేరు ముందుంటుంది. ఇలాంటి హీరోతో సినిమా చేయాలని ఏ దర్శకుడు అయినా కోరుకుంటాడు. కానీ తెలుగు ఇండస్ట్రీలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న తేజ మాత్రం సిద్ధంగా లేడట. చిత్రం, నువ్వు-నేను, జయం వంటి సినిమాలతో తెలుగు సినిమాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించాడు తేజ.. వెంకటేష్ వంటి హీరోతో మాత్రం సినిమా చేయడానికి సిద్ధంగా లేడట. అందుకు ఓ కారణం ఉందండోయ్.

Advertisement

వెంకటేష్ ఇదివరకు తన తరువాత  సినిమా తేజ దర్శకత్వంలో చేస్తానని మాట ఇచ్చాడట. కానీ ఆ మాట నెరవేర్చుకోకపోవడంతో వెంకటేష్ పై చాలా ఆగ్రహంగా ఉన్నాడట తేజ. వెంకటేష్ తో ఈ జన్మలో కూడా సినిమా తీయను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాత్రం దానికే ఇలా ఫీల్ అయితే ఎలా ? అంటూ అభిమానులు సైతం తేజపై సెటైర్స్ వేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ అన్నప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుదరవచ్చు.. కుదరకపోవచ్చు. వెంకటేష్ మాత్రం అంత ఈజీగా ఎవ్వరినీ హర్ట్ చేయడు. ఇక వెంకటేష్ సినిమాల విషయానికొస్తే.. శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీలో నటిస్తున్నాడు. వెంకటేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. నిహారిక ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియా భాషలతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. మరీ ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అల్లు అర్జున్ అరుదైన రికార్డు.. ఇండియాలో ఏ హీరో కి కూడా సాధ్యం కాలేదు..!

చాలా చిన్న జీవితాన్ని గడపాలనుకున్నా.. కానీ వదిన వల్లనే అంతా.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

 శేఖర్ కమ్ముల ప్లాన్ మామూలుగా లేదుగా.. మల్టీస్టారర్ గా మారిన ధనుష్ మూవీ..!

Visitors Are Also Reading