ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాలో మరే హీరోకు సాద్యం కానీ ఓ సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కేవలం ఇన్ స్టా గ్రామ్ ఖాతాలోనే రెండు కోట్లకు (21.8 మిలియన్స్) పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అదేవిధంగా ట్విట్టర్ ఖాతాలో అల్లు అర్జున్ ని 75 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
Advertisement
ఇటీవలే ట్విట్టర్ కి పోటీగా మార్క్ జుకర్ బర్గ్ థ్రెడ్స్ అనే సోషల్ మీడియా యాడ్ వచ్చింది. ఈ యాడ్ లో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు అకౌంట్ ఓపెన్ చేశారు. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు. అయితే అల్లు అర్జున్ థ్రెడ్స్ లోకి అలా వచ్చాడో లేదో.. అప్పుడు వన్ మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇండియాలోనే మరే సినిమా స్టార్ కూడా ఈ ఘనత సాధించలేదు. థ్రెడ్స్ యాప్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. దీంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Advertisement
ఈ మధ్యే థ్రెడ్స్ యాప్ లాంచ్ అయింది. తొలి వారంలోనే 10 కోట్ల యూజర్లను రాబట్టింది. ఇది లాంఛ్ అయినప్పుడు ఈ ఫ్లాట్ ఫామ్ లో చేరిన మొట్టమొదటి సౌత్ హీరో అల్లు అర్జున్. ఇప్పుడు థ్రెడ్స్ లో 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ని సాధించిన తొలి ఇండయన్ గా రికార్డు క్రియేట్ చేశాడు. సోషల్ మీడియాలో బన్నీ క్రియేట్ చేసిన రికార్డు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. పుష్ప 2 షూటింగ్ సెట్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. పుష్ప మూవీ బంపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రధానంగా పాన్ ఇండియా లెవల్ లో దీంతో మరో హిట్ కొట్టాలని బన్నీ ప్లాన్. ఈ సినిమా కోసం బన్నీ బాగానే కష్టపడుతున్నాడు. పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ రేటు కొడితే అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందనే చెప్పవచ్చు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ 5 హీరోలు వీళ్ళే..!
శేఖర్ కమ్ముల ప్లాన్ మామూలుగా లేదుగా.. మల్టీస్టారర్ గా మారిన ధనుష్ మూవీ..!