Home » Chiranjeevi: హై కోర్ట్ లో మెగాస్టార్ కు ఊరట.. ఆ పాత కేసు కొట్టివేత! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే?

Chiranjeevi: హై కోర్ట్ లో మెగాస్టార్ కు ఊరట.. ఆ పాత కేసు కొట్టివేత! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన మెగాస్టార్ చిరంజీవి తిరుపతి నుంచి ఎంపీ గా గెలిచారు. అయితే.. ప్రజారాజ్యం పార్టీని ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి మనకి తెలిసినదే. ఆగష్టు 2011 లోనే ఈ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న సమయంలోనే ఆయన కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు.

Advertisement

ఆ తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా వచ్చారు. ఆయన రాజకీయాలకు దూరమై పదేళ్లు కావొస్తోంది. ఇప్పటికీ ఏపీ రాజకీయాల్లో ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. అయితే, ఆయన రాజకీయాలకు దూరంగా వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖైదీ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఆయనకు హై కోర్ట్ ఊరట నిచ్చే న్యూస్ చెప్పింది. చిరంజీవి రాజకీయాల్లో ఉన్న సమయంలో ఆయనపై ఎన్నికలకు సంబంధించి ఓ కేసు నమోదు అయ్యింది.

Advertisement

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫుల్ యాక్టివ్ గా ఉన్న చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారాన్ని కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన నిర్ణీత సమయంలో మీటింగ్ పూర్తి చేయలేదని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కారణంగా ఆయనపై గుంటూరు పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసుని కొట్టివేయాలంటూ.. చిరంజీవి హై కోర్ట్ కు అప్పీలు చేసుకున్నారు. అయితే.. ఈ కేసు ను ప్రాసిక్యూషన్ తరపు వారు రుజువు చేయలేకపోవడంతో హై కోర్ట్ ఈ కేసును కొట్టివేసింది. మొత్తానికి ఈ కేసు విషయమై చిరంజీవికి ఊరట లభించింది.

మరిన్ని..

RRR 2 కి దర్శకత్వం వహించేది ఎవరో తెలుసా ? జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా..!

హరికృష్ణ చివరి కోరిక ఇదేనట..ఇన్నాళ్లకు బయట పడింది !

నయనతార భర్తకు షారూఖ్ ఖాన్ వార్నింగ్.. అందుకోసమేనా ? 

Visitors Are Also Reading