టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కొన్ని సందర్భాల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి పంత్ టీమిండియాకు విజయాలను చేకూర్చాడు. టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్ లలో మెరుగ్గా ఆడాడు పంత్. అయితే పంత్ ఇటీవలే ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే రిషబ్ పంత్ 2023 ప్రపంచ కప్ ఆడగలడా..? లేదా గతంలో బీసీసీఐ నుంచి మెడికల్ అప్డేట్ వచ్చిన తరువాత ఈ ప్రశ్నలు తతెత్తడం ప్రారంభం అయ్యాయి. గతంలో బోర్డు పంత్ ఫిట్ నెస్ అప్డేట్ ఇచ్చింది.
Advertisement
పంతో చాలా వేగంగా కోలుకుంటున్నాడని.. బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని బోర్డు వెల్లడించింది. పంతో కోలుకోవడం చూస్తుంటే.. అతనికి ప్రపంచ కప్ ఆడిపించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. పంత్ ఫిట్ గా ఉన్నప్పటికీ ప్రపంచకప్ ఆడకూడదని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ పేర్కొన్నాడు. పంత్ గురించి మాట్లాడుతూ.. టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి ఫిట్ గా మారినప్పటికీ ప్రపంచ కప్ ఆడకూడదని అన్నాడు. అతను టీమిండియాకు చాలా ముఖ్యమైన ఆటగాడని.. భవిష్యత్ లో కెప్టెన్ కూడా అయ్యే అవకాశం ఉందన్నాడు. ఇలాంటి పరిస్థితిలో పంత్ అస్సలు తొందరపడకూడదు. కోలుకోవడానికి పూర్తి సమయం తీసుకోవాలి. రిషబ్ పంత్ పూర్తిగా ఫిట్ గా తిరిగి రావడానికి కొంతసమయం పడుతుందని చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్. పంత్ ప్రపంచకప్ ఆడతాడని అయితే తాను భావించడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Advertisement
గత ఏడాది చివరిలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పంత్ కి చాలా గాయాలయ్యాయి. అతనికి శస్త్ర చికిత్స కూడా చేయాల్సి వచ్చింది. పంత్ పరిస్థితి చూస్తుంటే.. అతను తిరిగి మైదానంలోకి రావడానికి చాలా సమయం పట్టవచ్చని భావించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ చాలా వేగంగా కోలుకున్నాడు పంత్. రెండు నెలల క్రితమే ఊత కర్రల సాయంతో నడుస్తూ కనిపించాడు. ఇక అదే సమయంలో అతను నెట్స్ లో వికెట్ కీపింగ్ చేయడం ప్రారంభించాడు. దీంతో పంత్ ప్రపంచ కప్ ఆడతాడని అభిమానులు భావిస్తున్నారు. ఇదే సమయంలో అతనికి విశ్రాంతి చాలా అవసరమని జాఫర్ సూచించడం విశేషం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Suryakumar Yadav : టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక?
గ్రాండ్ గా SRH కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ పెళ్లి…ఫోటోలు వైరల్
ఇండియా – పాక్ మ్యాచ్ కోసం ఆస్పత్రి బెడ్లూ